విజయ్ గెలుపు వెనుక రహస్యాన్ని బయటపెట్టిన తండ్రి

by Gantepaka Srikanth |   (  Updated:2026-05-04 11:12:44  IST  )

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ, తన తొలి ఎన్నికల్లోనే ప్రభంజనం సృష్టిస్తున్న 'తమిళగ వెట్రి కళగం' (TVK) అధినేత, దళపతి విజయ్ విజయంపై ఆయన తండ్రి చంద్రశేఖర్ భావోద్వేగానికి లోనయ్యారు.

విజయ్ గెలుపు వెనుక రహస్యాన్ని బయటపెట్టిన తండ్రి
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ, తన తొలి ఎన్నికల్లోనే ప్రభంజనం సృష్టిస్తున్న 'తమిళగ వెట్రి కళగం' (TVK) అధినేత, దళపతి విజయ్ విజయంపై ఆయన తండ్రి చంద్రశేఖర్ భావోద్వేగానికి లోనయ్యారు. మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, విజయ్ రాజకీయ ప్రస్థానం, అతని దృఢ సంకల్పం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. "ఇది విజయ్ సంకల్పానికి దక్కిన విజయం. ఏ రంగంలోనైనా నాయకుడికి ముందు తన మీద తనకు నమ్మకం ఉండాలి. విజయ్‌లో ఆ నమ్మకం మొదటి నుండి పుష్కలంగా ఉంది. గత రెండేళ్లుగా అతడిని నేను చాలా దగ్గర నుండి చూస్తున్నాను. ఈ ఎన్నికల్లో గెలుస్తాననే విషయంలో విజయ్ ఏనాడూ సందేహపడలేదు. ఎప్పుడూ ఒకటే చెప్పేవాడు. కచ్చితంగా ముఖ్యమంత్రిని అవుతానని, ప్రజల కోసం పనిచేస్తానని నమ్మకంగా ఉండేవాడు. ఆ ఆత్మవిశ్వాసమే ఈరోజు అతడిని ఈ స్థాయిలో నిలబెట్టింది. తన మీద తనకు ఉన్న నమ్మకాన్ని అతడు ఎప్పుడూ కోల్పోలేదు" అని చంద్రశేఖర్ ఆనందం వ్యక్తం చేశారు.

తండ్రి గర్వం..

తన కుమారుడు రాజకీయాల్లో సాధిస్తున్న ఫలితాల పట్ల చంద్రశేఖర్ గర్వంగా ఉందన్నారు. రాజకీయాల్లోకి రావడానికి విజయ్ పడ్డ కష్టాన్ని, పక్కా ప్రణాళికను తండ్రిగా చూశానని వివరించారు. మరోవైపు పాత రాజకీయ శక్తులను ఎదిరించి విజయ్ నిలబడటం తమిళనాడులో మార్పుకు సంకేతమని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం తమిళనాడు ఎన్నికల ట్రెండ్స్‌లో టీవీకే పార్టీ అనూహ్యమైన ఓట్లను సాధించడమే కాకుండా, కొలత్తూరు వంటి కీలక స్థానాల్లో డీఎంకే వంటి బలమైన పార్టీలకు చుక్కలు చూపిస్తుండటంతో విజయ్ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.

తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం: సీఎం స్టాలిన్‌‌ను ఓడించిన TVK అభ్యర్థి

విజయ్ ఇంట గెలుపు సంబరాలు.. 'విజిల్' వేస్తూ జోష్

విజయ్ ప్రభంజనం వేళ వైరల్‌గా మారిన బండ్ల గణేష్ ట్వీట్

విజయ్ రాజీనామా చేసే స్థానంలో త్రిష?.. TVK ప్రభుత్వంలో చక్రం తిప్పబోతున్న బ్యూటీ

తమిళనాడులో కొత్త ట్రెండ్.. విజయ్ ఫోటో చీరతో మహిళ సందడి!


Next Story