- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయ్ ఇంట గెలుపు సంబరాలు.. 'విజిల్' వేస్తూ జోష్
తమిళ రాజకీయాల్లో విజయ్ సంచలన విజయంపై ఆయన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ స్పందించారు. ఎవరితోనూ పొత్తు లేకుండా ఒంటరిగా గెలవడం గర్వంగా ఉందన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తమిళనాడు రాజకీయాల్లో టీవీకే పార్టీ సంచలనం సృష్టించింది. తొలి ఎన్నికల్లోనే డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు షాకిచ్చింది. దీంతో టీవీకే (TVK) అధినేత విజయ్ ఇంటి వద్ద అభిమానులు, పార్టీ నేతలు సంబరాలు జరుపుకుంటున్నారు. అధికార డీఎంకేను కోలుకోలేని దెబ్బ కొట్టిన విజయ్ ఇంట గెలుపు సంబరాలు విన్నంటాయి. విజయ్ (Vijay) తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు 'విజల్' వేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక కొడుకు విజయంపై విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ స్పందించారు. ఒక తండ్రిగా తనకెంతో గర్వంగా ఉందని తమిళనాడు రాజకీయాల్లో విజయ్ పెను మార్పులు తీసుకొస్తాడని అన్నారు. ఎవరితోనూ పొత్తులు లేకుండా ఒంటరిగా తన కాళ్లపై నిలబడి విజయ్ గెలిచాడని ఆనందం వ్యక్తం చేశాడు. ఇది ఒక్క విజయ్ కే కాదు.. తమిళనాడు రాష్ట్రానికే చారిత్రాత్మక విజయం అని అభివర్ణించాడు.
విజయ్ రాజీనామా చేసే స్థానంలో త్రిష?.. TVK ప్రభుత్వంలో చక్రం తిప్పబోతున్న బ్యూటీ






