- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయ్ రాజీనామా చేసే స్థానంలో త్రిష?.. TVK ప్రభుత్వంలో చక్రం తిప్పబోతున్న బ్యూటీ
తమిళనాడులో విజయ్ ప్రభంజనం సృష్టిస్తుంటే.. మరోవైపు నటి త్రిష రాజకీయ అరంగేట్రంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. టీవీకే ప్రభుత్వంలో లో ఆమె కీలక పాత్ర పోషిం

దిశ, డైనమిక్ బ్యూరో: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త చరిత్ర లిఖితమవుతోంది. ఇవాళ వెలువడుతున్న ఫలితాల్లో టీవీకే పార్టీ దూసుకుపోతోంది. విజయ్ తాను పోటీ చేసిన తిరుచ్చి ఈస్ట్, పెరంబూరు ఈ రెండు చోట్లా విజయం దాదాపు ఖాయం అయింది. దీంతో ఈ రెండు సీట్లలో ఒకదానిని ఆయన వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఏ సీటు వదులుకుంటారు? విజయ్ వదులుకునే స్థానంలో బరిలోకి దిగబోయేది ఎవరు అనేది తమిళ రాజకీయాల్లో ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. అయితే తమిళనాట వినిపిస్తున్న ప్రచారం ప్రకారం విజయ్ రాజీనామా చేయబోయే స్థానం నుంచి ప్రముఖ నటి త్రిష (Trisha) పోటిచేస్తుందనే ప్రచారం గుప్పుమంటోంది.
నంబర్ 2 స్థానం:
విజయ్, త్రిష మధ్య రిలేషన్ పై రాజకీయ వర్గాల్లో రకరకాల వాదనలు వినిపిస్తున్న వేళ త్రిష పేరు మరోసారి చర్చకు రావడం ఆసక్తిగా మారింది. నిజానికి విజయ్ పార్టీ ప్రకటించిన నాటి నుంచి తమిళనాడు రాజకీయాల్లో త్రిష పేరు చర్చకు వస్తూనే ఉంది. ఎన్నికల ప్రచారంలో త్రిష, విజయ్‍కు మధ్య సంబంధాలు ఉన్నాయంటూ డీఎంకే, బీజేపీ ఎన్నికల ప్రచారం సాగించాయి. గతంలో టిక్కెట్ల కేటాయింపు విషయంలోనూ టీవీకే నేతలు త్రిష ఇంటి వద్ద క్యూ కట్టినట్లు వార్తలు వచ్చాయి. దీన్ని బట్టి పార్టీలో ఆమె ప్రాధాన్యత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే విజయ్ రాజీనామా చేయబోయే స్థానం నుంచి త్రిష రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారని అక్కడ గెలిస్తే ఆమెకు ప్రభుత్వంలోనూ కీలకమైన పదవి దక్కబోతున్నట్లు పొలిటికల్ కారిడార్ లో చర్చ వినిపిస్తోంది. జరుగుతున్న ప్రచారం ప్రకారం విజయ్ సీఎం అయితే త్రిష డిప్యూటీ సీఎం లేదా హోంశాఖ అప్పగించబోతున్నట్లు ప్రచారం జరుగుతోది. ఇప్పటికే టీవీకే పార్టీలో త్రిష అప్రకటితంగా నెంబర్ 2 స్థానంలో ఉన్నారని, భవిష్యత్‍లో ప్రభుత్వంలోనూ నంబర్ టూ లో కొనసాగబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరికొందరు మాత్రం విజయ్ తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖరన్ బరిలో ఉంటారని చెబుతున్నారు.
విజయ్ ఇంటికి త్రిష:
ఇదిలా ఉంటే ఇవాళ ఫలితాల నేపథ్యంలో విజయ్ నివాసానికి త్రిష వెళ్లారు. ఇవాళ తన పుట్టినరోజు సందర్భంగా తిరుమల వెళ్లిన త్రిష అక్కడినుంచి నేరుగా విజయ్ ఇంటికి చేరుకోవడం ఆసక్తిగా మారింది. ఇదిలా ఉంటే ఫ్యూచర్ లో తాను తప్పకుండా సీఎం అవుతానంటూ గతంలో త్రిష చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను ఇప్పుడు నెటిజన్లు షేర్ చేస్తున్నారు. అసలే సంచలనాలకు కేరాఫ్ గా నిలిచే తమిళ రాజకీయంలో ఏం జరగబోతోంది? త్రిజ నిజంగానే రాజకీయ రంగ ప్రవేశం చేస్తారా అనేది వేచి చూడాలి.






