- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మైండ్ స్పేస్ వద్ద ఫుట్ పాత్ ఆక్రమణలు తొలగింపు
by Taduka Kalyani |
మాదాపూర్‌లోని మైండ్‌స్పేస్ కు వెళ్లే దారిలో ఫుట్ పాత్ ఆక్రమించి ఏర్పాటు చేసిన వ్యాపార సముదాయాలను టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు.

X
దిశ, శేరిలింగంపల్లి : మాదాపూర్‌లోని మైండ్‌స్పేస్ కు వెళ్లే దారిలో ఫుట్ పాత్ ఆక్రమించి ఏర్పాటు చేసిన వ్యాపార సముదాయాలను టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. గతంలో ఆక్రమణలు తొలగించిన రోడ్డును మళ్లీ ఆక్రమించి షాపుల ఏర్పాటు చేసిన యాజమాన్యాలకు హెచ్చరించిన పట్టించుకోకపోవడంతో రెండోసారి కూల్చివేతలు చేపట్టినట్లు టౌన్ ప్లానింగ్ అధికారులు సంతోష్, హబీబా తెలిపారు. పోలీసుల సమన్వయంతో, సైబరాబాద్ వ్యాప్తంగా ఫుట్‌పాత్‌ల ఆక్రమణల తొలగింపు డ్రైవ్‌లను నిర్వహిస్తున్నారు. పాదచారుల రాకపోకలను మెరుగుపరచడానికి, ట్రాఫిక్ జామ్ కు అంతరాయం లేకుండా చేసేందుకు కూల్చివేతలు చేపట్టారు. ఫుట్‌పాత్‌లపై ఉన్న అనధికారిక ఆహార దుకాణాలు, విక్రయశాలలు, ఇతర తాత్కాలిక నిర్మాణాల ఆక్రమణలను తొలగిస్తున్నారు. మియాపూర్ ఆల్బం కాలనీ లోను పుట్ట ట్రాక్టర్లు తొలగించినట్లు తెలిపారు.
Next Story






