స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలి: మాజీ మేయర్

by Kodari Anjali |

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలని బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ సూచించారు.

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలి: మాజీ మేయర్
X

దిశ, మేడిపల్లి: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలని బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ సూచించారు. బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని అశోక్ నగర్‌లో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని శనివారం పరిశీలించారు. బూత్ నంబర్–418లో సర్వే నిర్వహిస్తున్న బూత్ లెవెల్ అధికారులతో మాట్లాడి సర్వే ప్రక్రియ, నమోదు విధానం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తోటకూర అజయ్ యాదవ్ మాట్లాడుతూ, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో అర్హులైన ఏ ఒక్కరి ఓటు కూడా తొలగిపోకుండా ప్రతి ఓటరు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అధికారులు నిర్వహిస్తున్న సర్వేకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని, అవసరమైన పత్రాలను సమర్పించి తమ ఓటరు వివరాలను ధృవీకరించుకోవాలని సూచించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏలు ప్రతి ఇంటిని సందర్శించి ఓటరు వివరాలను పరిశీలించాలని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో కొనసాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తిరుపతి రెడ్డి, సంజీవ్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, నరసింహ, శ్రీనివాస్ గౌడ్, బీఎల్ఏలు, స్థానిక కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

Next Story