మరణంలోనూ వీడని స్నేహబంధం..

by Kodari Anjali |

కారు అదుపుతప్పిన ఇద్దరు యువకులు కానరాని లోకాలకు వెళ్లిపోయిన ఘటన గంభీరావుపేటలో చోటుచేసుకుంది.

మరణంలోనూ వీడని స్నేహబంధం..
X

దిశ, గంభీరావుపేట: వారు ముగ్గురూ స్నేహితులు. చిన్నప్పటి నుంచి కలిసి చదువుకోని ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటున్నారు. అనివేష్ అనే వ్యక్తి బ్యాంకులో ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు. తాము పనులు చేస్తూ కుటుంబానికి తల్లిదండ్రులకు సహాయంగా ఉంటూ పోషించుకుంటున్నారు. కోట అనిల్ యాదవ్ గతంలో హైదరాబాదులో హోటల్ మేనేజ్మెంట్ చేసి, రెండు సంవత్సరాలు గల్ఫ్ కు వెళ్లి వచ్చి తండ్రికి చేదోడు వాదోడుగా వ్యవసాయ పనుల్లో సహాయపడుతూ ఉండేవాడు. జీవితాన్ని సంతోషంగా గడుపుతున్న వీరిని మృత్యువు వెంటాడింది. కారు అదుపుతప్పిన సంఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు చికిత్స పొందుతూ మరణించారు. మరో యువకునికి తీవ్ర గాయాలై ఆసుపత్రి పాలైన సంఘటన శనివారం గంభీరావుపేటలో చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం కాకుల గుట్ట తండా సమీపంలో శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది.

కన్నీరుమున్నీరవుతున్న కుటుంబీకులు...

మాచారెడ్డి ఎస్.ఐ. అనిల్ తెలిపిన మేరకు వివరాలు... రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన ముగ్గురు బాల్య స్నేహితులు బంగ్లా అన్వేష్ గౌడ్ (25), కోట అనిల్ (24), దుంపల వికాస్(23) స్వంత పనికై కామారెడ్డికి కారులో వెళ్లి తిరిగి వస్తున్నారు. మాచారెడ్డి మండలం కాకుల గుట్ట తండా సమీపంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టుని ఢీకొట్టింది. ఈ ఘటనలో అనిల్ (24) అక్కడికక్కడే మృతి చెందగా.. అన్వేష్ వికాస్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. తదనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాదుకు తరలించారు. చికిత్స పొందుతూ.. అన్వేష గౌడ్ మృతిచెందగా.. దుంపల వికాస్ కోమాలో ఉన్నట్టుగా వైద్యులు నిర్ధారించారు. దీంతో మృతుల కుటుంబాల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. మృతులిద్దరూ తల్లిదండ్రులకు ఒక్కరే కుమారులు కావడంతో వారి దుఃఖానికి అంతులేకుండా పోయింది. మండల కేంద్రంలో ప్రతి ఒక్కరు దుఃఖ సముద్రంలో ముంగిపోయారు.

Next Story