రాగల ఐదురోజుల్లో.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.

రాగల ఐదురోజుల్లో.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రాగల ఐదు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. నేడు రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిర్మల్, కుమరం భీం అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.

వర్షపాతం వివరాలు

ములుగు జిల్లా వెంకటాపురంలో 10 సెం.మీ, మహబూబాబాద్ జిల్లా మరిపెడలో 8 సెం.మీ, జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో 6.6 సెం.మీ, కరీంగనర్ జిల్లా దుర్శేడులో 5.8 సెం.మీ, మహబూబాబాద్ జిల్లా దోర్కనకల్ లో 5.6 సెం.మీ, సూర్యాపేట జిల్లా ముకుందపురంలో 5.6 సెం.మీ, మెదక్ జిల్లా రామాయంపేట్ లో 5.3 సెం.మీ, ఖమ్మం జిల్లా తల్లాడలో 5 సెం.మీ, మహబూబాబాద్ జిల్లా భయ్యారంలో 5 సెం.మీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో 4 సెం.మీ, చంద్రుగొండలో 4 సెం.మీ, కుమరం భీం జిల్లా సిర్పూరులో 3 సెం.మీ, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో 3 సెం.మీ, ఆదిలాబాద్ లో 3 సెం.మీ, ఖమ్మంజిల్లా కొణిజెర్లలో 3 సెం.మీ, ములుగు జిల్లా తాడ్వాయిలో 2 సెం.మీ చొప్నున వర్షపాతం నమోదైంది.

Next Story