రేపు తెలంగాణకు నితిన్​నబీన్ రాక.. మూడ్రోజుల పర్యటన షెడ్యూల్ ఇదే

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-06-27 16:44:45  IST  )

బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ రేపు రాష్ట్ర పర్యటనకు రానున్నారు.

రేపు తెలంగాణకు నితిన్​నబీన్ రాక.. మూడ్రోజుల పర్యటన షెడ్యూల్ ఇదే
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ రేపు (ఆదివారం) రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఇప్పటికే పార్టీ రాష్ట్ర నేతలు పర్యటనకు సంబందించిన ఏర్పాటు చేశారు. ఆయన అధ్యక్షుని బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటి సారి మున్సిపల్​ఎన్నికల వేళ మహబూబ్​నగర్ వచ్చారు. అక్కడ నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లారు తప్ప హైదరాబాద్​లో అడుగు పెట్టలేదు. రెండవ సారి చేసే పర్యటనలో ఒక రోజంతా గ్రేటర్​నగరంలో గడపనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు శంషాబాద్ విమానశ్రయం నుంచి చేరుకుని 4 గంటలకు రంగారెడ్డి జిల్లా కార్యాలయం చేరుకుని అక్కడ నుండి రాష్ట్రంలోని దాదాపు 9 జిల్లాల నూతన పార్టీ కార్యాలయాలను వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. సాయంత్రం 5 నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌ చేరుకుని 6.50 గంటల వరకు జీహెచ్ఎంసీ పరిధిలోని బూత్ అధ్యక్షులతో భేటీ అవుతారు. తరువాత రాష్ట్ర కార్యాలయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తారు. రెండవ రోజు 29న సోమవారం 10 గంటల నుంచి 11.30 గంటల వరకు విబిఐటి ఇంజనీరింగ్ కాలేజీ క్యాంపస్‌లో విద్యార్థులతో నిర్వహించే ప్రత్యేక కాన్​క్లేవ్​కు హాజరవుతారు. 12 గంటలకు భువనగిరిలో కార్యకర్తలు స్వాగతం పలుకుతారు. 12.50 గంటలకు భద్రకాళి అమ్మవారి దర్శనం, 2 గంటలకు హన్మకొండలోని అశోక్ హోటల్​లో ఆదివాసీ, గిరిజన తెగల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. 4 గంటలకు వరంగల్​ఆర్స్ట్​కళాశాల మైదానంలో ఉమ్మడి వరంగల్ జిల్లా బూత్ ప్రెసిడెంట్స్ సమావేశంలో పాల్గొంటారు. 30వ తేదీ చివరి రోజు 11.30 గంటల నుండి 13 గంటల వరకు ఘట్‌కేసర్‌లో రాక్ ఎన్​క్లేవ్​కన్వేన్షన్​లో జరిగే రాష్ట్ర కార్యవర్గ, ఆఫీస్ బేరర్స్ సమావేశంలో పాల్గొని ప్రసంగించిన అనంతరం ఢిల్లీకి తిరుగుపయనమవుతారు.

Next Story