- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కామారెడ్డి బస్టాండ్‌ను అభివృద్ధి చేస్తా : మంత్రి పొన్నం ప్రభాకర్
by Batti.Sumithra |
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్న ఆర్టీసీ బస్టాండ్‌ను అభివృద్ధి చేస్తానని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

X
దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్న ఆర్టీసీ బస్టాండ్‌ను అభివృద్ధి చేస్తానని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం డీసీసీ లీగల్ సెల్ చైర్మన్ దేవరాజ్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోనె శ్రీనివాస్, భిక్కనూరు మాజీ జడ్పీటీసీ సభ్యుడు నంద రమేష్‌లు హైదరాబాద్‌లోని తన చాంబర్‌లో మంత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం కామారెడ్డి అభివృద్ధిపై మంత్రితో చర్చించారు. ముఖ్యంగా సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీ బస్టాండ్‌ను అభివృద్ధి చేయాలని కోరగా, మంత్రి సానుకూలంగా స్పందించినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. వారి వెంట పార్టీ సీనియర్ నాయకులు శ్రీరామ్ ఆనంద్, అల్లాడి సుదర్శన్ ఉన్నారు.
Next Story






