దేశంలో లీక్ కాని పరీక్షలు ఇంకేమన్నా మిగిలాయా? : CJP వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే

by Muthe.Rajitha |

మహారాష్ట్రలోని భీవండిలో జరిగిన టెట్‌ (TET) ప్రశ్నపత్రం లీక్‌ ఘటనపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

దేశంలో లీక్ కాని పరీక్షలు ఇంకేమన్నా మిగిలాయా? : CJP వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే
X

దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్రలోని భీవండిలో జరిగిన టెట్‌ (TET) ప్రశ్నపత్రం లీక్‌ ఘటనపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పేపర్‌ లీకేజీ అనేది ఇకపై ఎప్పుడో ఒకసారి జరిగే పొరపాటు కాదని, ఇది ప్రస్తుత ప్రభుత్వానికి పర్మినెంట్ మార్క్‌గా మారిపోయిందని మండిపడ్డాయి. లక్షలాది మంది నిరుద్యోగ యువత, విద్యార్థుల కఠోర శ్రమను, వారి ఉజ్వల భవిష్యత్తును నాశనం చేస్తున్న ఇటువంటి లీకుల ముఠాల వెనుక ఏ రాజకీయ నాయకుడి హస్తం ఉందో, వారికి ఎవరు అండగా నిలుస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. టెట్ లీకేజిపై కాక్రోచ్‌ జనతా పార్టీ కాక్రోచ్‌ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. అసలు మన దేశంలో ఎలాంటి లీక్‌లు కాకుండా, అత్యంత పారదర్శకంగా జరుగుతున్న పరీక్షలు ఇంకా ఏమైనా మిగిలి ఉన్నాయా అంటూ అభిజిత్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేసారు. ప్రభుత్వ విద్యా విధానాన్ని, పరీక్షల నిర్వహణ తీరును తప్పుపడుతూ, టెట్‌ పేపర్‌ లీక్‌కు కారణమైన నిందితులను తక్షణమే గుర్తించి వారిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Next Story