- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళా క్రికెటర్ల కోసం ఐసీసీ మరో కీలక నిర్ణయం.. ప్లేయర్ల నుంచి భారీ మద్దతు
ఆన్‌లైన్ ట్రోలింగ్, వేధింపుల నుంచి మహిళా క్రికెటర్లకు రక్షణ కల్పించడానికి ఐసీసీ చర్యలు చేపట్టింది.

దిశ, స్పోర్ట్స్ : ఆన్‌లైన్ ట్రోలింగ్, వేధింపుల నుంచి మహిళా క్రికెటర్లకు రక్షణ కల్పించడానికి ఐసీసీ చర్యలు చేపట్టింది. అందుకోసం ప్లేయర్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చింది. ఈ మేరకు ఏఐ సంస్థ ఫ్రీడమ్ 2 హియర్‌తో కలిసి ఒప్పందం చేసుకుంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, టిక్ టాక్, ఎక్స్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల నుంచి మహిళా అథ్లెట్లు ట్రోలింగ్ బారినపడకుండా ఈ ప్రోగ్రామ్‌ను రూపొందించారు. క్రికెటర్ల సోషల్ మీడియా ఖాతాలను ప్రత్యేకమైన ఏఐ టూల్ నిశితంగా గమనిస్తుంది. వేధింపులు, బెదిరింపులు, భయపెట్టడం వివక్ష వంటి హానికరమైన కంటెంట్‌ను గుర్తించి వాటిని డిలీట్ చేస్తుంది. ఈ ప్రోగ్రామ్‌కు మహిళా క్రికెటర్ల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొన్న 12 జట్లలో 7 జట్లకు ఈ ఏఐ టూల్ ద్వారా రక్షణ కల్పిస్తున్నట్టు ఐసీసీ వెల్లడించింది. 100కుపైగా మహిళా క్రికెటర్లు జాయిన్ అయినట్టు తెలిపింది. అంపైర్లు, బ్రాడ్‌కాస్టర్స్ కూడా రిజిస్టర్ అయినట్టు పేర్కొంది. ‘ఫ్రీడమ్ 2 హియర్ టూల్ 2,50,000 కామెంట్లను రివ్యూ చేసింది. అందులో 60 వేల చెత్త పోస్టులను తొలగించింది. పదే పదే కామెంట్స్ చేస్తున్న 2 వేల మందిపై తాత్కాలికంగా నిషేధం విధించాం. 370 మందిని బ్లాక్ చేశాం.’అని ఐసీసీ తెలిపింది. భారత స్పిన్నర్ రాధ యాదవ్, ఇంగ్లాండ్ వికెట్ కీపర్, బ్యాటర్ అమీ జోన్స్‌తోపాటు పలువురు ఈ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్‌లో జాయిన్ అయ్యారు.






