- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓవైపు మీటింగ్ నడుస్తుండగానే కునుకు తీసిన ట్రంప్.. నెట్టింట్లో భారీ ట్రోల్స్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ అధికారిక మీటింగ్ లో కునుకు తీయడం సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతోంది.

దిశ, వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ అధికారిక మీటింగ్ లో కునుకు తీయడం సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతోంది. వైట్ హౌస్ లో జరుగుతున్న ఓ ముఖ్యమైన అధికారిక సమావేశంలో పాల్గొన్న ట్రంప్.. అది నడుస్తుండగానే నిద్రలోకి జారుకున్నట్లు చూపిస్తున్న ఒక వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఆ మీటింగ్‌లో మిగిలిన ప్రతినిధులు, అధికారులు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలపై మాట్లాడుతుండగా.. ట్రంప్ మాత్రం కుర్చీలో కూర్చుని కళ్లు మూసుకుని గాఢంగా కునుకు తీస్తూ కెమెరాకు చిక్కారు. ఈ దృశ్యాలు బయటకు రావడంతో సోషల్ మీడియాలోని అన్ని ప్లాట్‌ఫారమ్స్‌లో ఈ వీడియో విపరీతంగా షేర్ అవుతూ ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారింది.
నెట్టింట్లో నెటిజన్ల భారీ ట్రోల్స్
ఈ వీడియో చూసిన నెటిజన్లు డొనాల్డ్ ట్రంప్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ భారీ ఎత్తున ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఇరాన్ మీద యుద్ధం గెలిచినట్టు కలగంటున్నాడేమో", మళ్ళీ ఏ దేశం మీద యుద్ధానికి కలగంటున్నాడో అని సెటైర్స్ వేస్తున్నారు. స్లీపీ ప్రెసిడెంట్ అంటూ వస్తున్న ట్రోలింగ్ పై వైట్ హౌస్ మీడియా ప్రతినిధులు స్పందిస్తూ.. అమెరికా చరిత్రలోనే అత్యంత చురుకైన అధ్యక్షుడు అంటూ పేర్కొనడం గమనార్హం.






