- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Badminton : యూఎస్ ఓపెన్‌లో సెమీస్‌కు దూసుకెళ్లిన శ్రీకాంత్, రౌనక్
యూఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ప్లేయర్లు కిదాంబి శ్రీకాంత్, రౌనక్ చౌహాన్, దేవిక సిహాగ్ అద్భుత ప్రదర్శన చేస్తున్నారు.

దిశ, స్పోర్ట్స్ : యూఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ప్లేయర్లు కిదాంబి శ్రీకాంత్, రౌనక్ చౌహాన్, దేవిక సిహాగ్ అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. వరుస విజయాలు సాధిస్తున్న ఈ ముగ్గురు శనివారం సెమీస్‌లో అడుగుపెట్టారు. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్‌లో శ్రీకాంత్ 21-9, 12-21, 21-8 తేడాతో చైనీస్ తైపీకి చెందిన లియావో జువో ఫును ఓడించాడు. 52 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో రెండో గేములో తప్ప శ్రీకాంత్‌దే పూర్తి ఆధిపత్యం. యువ ఆటగాడు రౌనక్ తన జోరును కొనసాగిస్తున్నాడు. రెండో రౌండ్‌లో టాప్ సీడ్‌కు షాకిచ్చిన అతను క్వార్టర్స్‌లోనూ సత్తాచాటాడు. ఇజ్రాయిల్‌కు చెందిన మిషా జిల్బెర్మాన్‌పై 23-21, 21-11తో విజయం సాధించాడు. సెమీస్‌లో చైనీస్ తైపీ ప్లేయర్ సు లి యాంగ్‌తో రౌనక్ తలపడనున్నాడు. మరో సెమీస్‌లో శ్రీకాంత్.. జపాన్‌కు చెందిన యుడై ఒకిమోటోను ఎదుర్కోనున్నాడు. ఇక యువ క్రీడాకారిణి దేవిక సిహాగ్ సెమీస్‌కు చేరుకుని ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ దిశగా చేరువైంది. క్వార్టర్ ఫైనల్‌లో ఆమె తన కంటే మెరుగైన ర్యాంకర్‌పై పైచేయి సాధించింది. జపాన్‌కు చెందిన రికో గుంజితో హోరాహోురీగా సాగిన మ్యాచ్‌లో దేవిక 22-20, 21-19తో సంచలన విజయం సాధించింది. సెమీస్‌లో దేవిక.. డెన్మార్క్ క్రీడాకారిణి లైన్ క్రిస్టోఫర్సన్‌తో తలపడనుంది. తన్వి శర్మ, రక్షిత శ్రీ క్వార్టర్స్‌లో ఓడి ఇంటిదారిపట్టారు.






