- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైద్యం కోసం 4 వేల కిలోమీటర్ల ప్రయాణం.. అయినా గాలిలో కలిసిన ప్రాణం
తమ చిన్నారిని ఎలాగైనా బతికించుకోవాలని 4 వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి హైదరాబాద్ వచ్చిన ఆ పేరెంట్స్ కు కన్నీళ్లే మిగిలాయి.

దిశ, వెబ్ డెస్క్ : తమ చిన్నారిని ఎలాగైనా బతికించుకోవాలని 4 వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి హైదరాబాద్ వచ్చిన ఆ పేరెంట్స్ కు కన్నీళ్లే మిగిలాయి. మంచి వైద్యం కోసం హైదరాబాద్ చేరుకుంటుండగానే.. ఎయిర్పోర్టులోనే పరిస్థితి విషమించి బాలిక కన్నుమూయడం ఆ కన్నవాళ్లను శోక సముద్రంలో ముంచి వేసింది. ఈ విషాద ఘటన వివరాల్లోకి వెళితే.. ఇథియోపియా దేశానికి చెందిన ఒక 13 సంవత్సరాల బాలిక కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోంది. స్వదేశంలో ఆమెకు రకరకాల వైద్య చి్రీత్సలు చేయించినప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో ఎలాగైనా తన కూతురిని బతికించుకోవాలని ఆరాటపడిన ఆ తండ్రి, భారత్ లోని హైదరాబాద్ నగరంలో మెరుగైన వైద్యం అందుతుందని తెలుసుకున్నాడు. ఇండియాకు వచ్చి చికిత్స చేయించే అంత ఆర్థిక స్థోమత లేకపోయినప్పటికీ, తెలిసిన వారి దగ్గర అతి కష్టం మీద డబ్బులు సర్దుబాటు చేసుకుని, కూతురిని తీసుకుని ఇథియోపియా ఎయిర్‌లైన్స్ విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరాడు.
మరికొద్దిసేపట్లో ఆసుపత్రికి.. అంతలోనే విషాదం
అయితే, విమానం శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ అవుతుండగానే ఆ బాలిక తీవ్రమైన అస్వస్థతకు గురైంది. విమాన సిబ్బంది వెంటనే స్పందించి, ల్యాండింగ్ పూర్తి కాగానే ఎయిర్‌పోర్ట్ ఆవరణలో ఉన్న అత్యవసర వైద్య కేంద్రానికి ఆమెను తరలించారు. అక్కడ వైద్యులు బాలికను పరీక్షించి, ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఎన్నో ఆశలతో, కూతురు కోలుకుంటుందనే నమ్మకంతో అంతదూరం వచ్చిన ఆ తండ్రికి విమానాశ్రయంలోనే గుండె పగిలే విషాదం ఎదురైంది.
హైదరాబాద్‌లోనే అంత్యక్రియలు
కూతురు మరణంతో ఆ తండ్రి ఎయిర్‌పోర్ట్‌లో కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇదిలావుండగా, మరణించిన బాలిక మృతదేహాన్ని తిరిగి తమ సొంత దేశమైన ఇథియోపియాకు తీసుకెళ్లడానికి ఆ కుటుంబం వద్ద తగినన్ని డబ్బులు లేవు. విమాన ప్రయాణానికే ఉన్న డబ్బులు అయిపోవడంతో, మృతదేహాన్ని స్వదేశానికి తరలించే ఆర్థిక భారాన్ని మోయలేక, ఆ బాలిక అంత్యక్రియలను హైదరాబాద్ నగరంలోనే నిర్వహించబోతున్నట్లు కన్నీటి పర్యంతమవుతూ వెల్లడించారు.






