రామమందిర విరాళాల చోరీపై ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు

by Ajay Maddhiboyina |

అయెధ్యలోని రామ మందిరం కోసం సేకరించిన విరాళాల చోరీపై కాంగ్రెస్ నేత, ఎంపీ ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. వయనాడ్ కలెక్టరేట్‌లో జరిగిన సమావేశం అనంతరం ప్రియాంక గాంధీ మీడియాతో మాట్లాడారు.

రామమందిర విరాళాల చోరీపై ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: అయెధ్యలోని రామ మందిరం కోసం సేకరించిన విరాళాల చోరీపై కాంగ్రెస్ నేత, ఎంపీ ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. వయనాడ్ కలెక్టరేట్‌లో జరిగిన సమావేశం అనంతరం ప్రియాంక గాంధీ మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా దేవుడిపై నమ్మకం, విశ్వాసం ఉన్నవాళ్లు విరాళాలు ఇచ్చారని, మందిరం కోసం సేకరించిన విరాళాల్లో అక్రమాలు జరగడం సిగ్గుచేటు, బాధాకరం అని అన్నారు. డబ్బును సేకరించి భద్రపరిచే బాధ్యత గల వాళ్లను కూడా జవాబుదారీగా చేయాలని పేర్కొన్నారు. యూపీ ప్రభుత్వం దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

అసలు ఏం జరిగింది.. ఎందుకు జరిగింది.. ఎలా జరిగింది అనేదానిపై సమగ్ర విచారణ జరగాలని అన్నారు. మహిళలు తమ ఇంట్లో దాచుకున్న డబ్బులను కూడా ఇచ్చారని, చాలా మంది పేదవాళ్లు కూడా ఇచ్చారని చెప్పారు. అవి కేవలం కార్పొరేట్ సంస్థలు ఇచ్చిన నిధులు కాదని అన్నారు. ఇదిలా ఉంటే ఆలయానికి చెందిన విరాళాలను దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో జూన్ 7న ఈ విషయం వెలుగులోకి వచ్చింది. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అభ్యర్థన మేరకు యూపీ ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించింది. ఇప్పటికే ట్రస్ట్ చైర్మన్ తన పదవికి రాజీనామా చేశారు. దీనిపై విచారణ కొనసాగుతోంది.

Next Story