వీకెండ్ ఎఫెక్ట్.. తిరుమలలో భక్తులు పోటెత్తడంతో టీటీడీ కీలక నిర్ణయం

by Ajay Maddhiboyina |

వీకెండ్ కావడంతో నేడు తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. భారీగా భక్తులు తరలిరావడంతో క్యూలైన్లు శిలాతోరణం వరకు భక్తులు చేరడంతో టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 24 నుండి 26 గంటల సమయం పడుతోంది.

వీకెండ్ ఎఫెక్ట్.. తిరుమలలో భక్తులు పోటెత్తడంతో టీటీడీ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: వీకెండ్ కావడంతో నేడు తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. భారీగా భక్తులు తరలిరావడంతో క్యూలైన్లు శిలాతోరణం వరకు భక్తులు చేరడంతో టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 24 నుండి 26 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం వీఐపీ, శ్రీవాణి దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. వీఐపీ దర్శనాలకు బ్రేక్ వేయడంతో ఆదివారం స్వీకరించే సిఫార్సు లేఖలను తీసుకోవడంలేదు. అంతేకాకుండా వెబ్ సైట్‌లో ఇన్ స్టంట్ గా ఇచ్చే 800 టికెట్లను సైతం జారీ చేయడంలేదు. ఇప్పటికే భక్తులు బాలాజీ నగర్ క్యాంపస్ వరకు వేచి ఉండగా వేల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. దీంతో సీనియర్ అధికారులు అక్కడే ఉండి ఆలయం వద్ద పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.

Next Story