- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కలిసి చద్దాం.. ప్రియురాలు పెళ్లికి నో చెప్పిందని కారులో నాటు బాంబులు విసిరిన ప్రియుడు
కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. ప్రియురాలు పెళ్లికి నో చెప్పిందని ప్రియుడు ఆమెపై దాడి చేసి అనంతరం కారులో పెట్రోల్ బాంబులు పేల్చాడు. ఈ ఘటనలో ప్రియుడు కారులో సజీవ దహనం అవ్వగా ప్రియురాలు తీవ్రగాయాలతో బయటపడింది.

దిశ, వెబ్ డెస్క్: కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. ప్రియురాలు పెళ్లికి నో చెప్పిందని ప్రియుడు ఆమెపై దాడి చేసి అనంతరం కారులో పెట్రోల్ బాంబులు పేల్చాడు. ఈ ఘటనలో ప్రియుడు కారులో సజీవ దహనం అవ్వగా ప్రియురాలు తీవ్రగాయాలతో బయటపడింది. వివరాల్లోకి వెళితే.. ఈ ఘటన తమకూరు జిల్లాలో శనివారం జాతీయరహదారిపై చోటు చేసుకుంది. ఉత్తర కర్ణాటకలోని అంకోలా జిల్లాలోని నాగేంద్ర అనే యువకుడికి తన ప్రియురాలు రమ్యతో పెళ్లి విషయంలో గొడవ జరిగింది. వీరిద్దరూ ఆరేళ్లుగా ప్రేమలో ఉండగా రమ్య నాగేంద్రను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించింది. అయినప్పటికీ నాగేంద్ర పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకురావడంతో రమ్య అతడి ఫోన్ నంబర్ సైతం బ్లాక్ చేసింది.
దీంతో నాగేంద్ర శనివారం ఆమె హాస్టల్ వద్దకు వెళ్లి గొడవకు దిగాడు. ఈ క్రమంలో ప్రియురాలిని కత్తితో బెదిరించి ఓ క్యాబ్ బుక్ చేసి అందులో కూర్చోవాలని చెప్పాడు. భయంతో రమ్య క్యాబ్ లో కూర్చోగా ఇద్దరి మధ్య పెళ్లి గురించి గొడవ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో రమ్య స్నేహితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కార్ నంబర్ ఆధారంగా డ్రైవర్ కు ఫోన్ చేశారు. ఆ సంభాషణ విన్న నాగేంద్ర పెళ్లి చేసుకోకపోతే కలిసి చద్దాం అంటూ తనవెంట తెచ్చుకున్న కత్తితో రమ్యపై దాడికి పాల్పడ్డాడు. అనంతరం తన జేబులో ఉన్న పెట్రోల్ బాంబులను కారులో విసిరేశాడు. డ్రైవర్ అప్రమత్తమై కారును ఆపివేసి కిందకు దూకేశాడు. రమ్య కూడా వెంటనే కిందకు దూకేసినప్పటికీ నాగేంద్ర కారులోనే ఉండిపోయాడు. ఈ ప్రమాదంలో నాగేంద్ర అక్కడిక్కడే మరణించాడు.






