- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటర్లకు పూర్తి అవగాహన కల్పించాలి : ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం (ఎస్‌ఐఆర్)లో భాగంగా శనివారం మణుగూరు మండలం సమితి సింగారం అరుంధతి నగర్‌లో బూత్ లెవల్ అధికారులు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఎస్‌ఐఆర్ దరఖాస్తు పత్రాలను అందజేశారు.

దిశ, మణుగూరు: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం (ఎస్‌ఐఆర్)లో భాగంగా శనివారం మణుగూరు మండలం సమితి సింగారం అరుంధతి నగర్‌లో బూత్ లెవల్ అధికారులు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఎస్‌ఐఆర్ దరఖాస్తు పత్రాలను అందజేశారు. అనంతరం ఎస్‌ఐఆర్ కార్యక్రమం అమలు విధానం, దరఖాస్తుల స్వీకరణ, ఓటరు వివరాల ధృవీకరణ, అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరు జాబితాలో నమోదు చేయడం వంటి అంశాలను ఎమ్మెల్యేకు వివరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసే కీలక ప్రక్రియ అని అన్నారు. అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి మినహాయించబడకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ముఖ్యంగా గ్రామాలు, కాలనీలు, గిరిజన ప్రాంతాలు, దూర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు ఎస్‌ఐఆర్ ప్రక్రియపై పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని అన్నారు.
దరఖాస్తుల సమర్పణ విధానం, అవసరమైన పత్రాలు, నమోదు ప్రక్రియ తదితర అంశాలను ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో వివరించాలని సూచించారు. అలాగే ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హ ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ నరేశ్, డీటీ రామారావు, సమితి సింగారం సర్పంచ్ కలబోయిన మాధవరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ పోలమూరి రాజు, రాష్ట్ర నాయకులు సామా శ్రీనివాసరెడ్డి, ఎస్. గణేష్ రెడ్డి, ముఖ్య నాయకులు, బీఎల్‌వోలు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.






