- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విడాకుల ప్రక్రియ నాకు నచ్చదు.. త్రిష సెన్సేషనల్ కామెంట్స్
ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా వరుస సినిమాలు చేస్తున్న ఎవర్ గ్రీన్ బ్యూటీ త్రిష.. తాజాగా తన పెళ్లిపై కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది.

దిశ, సినిమా: ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా వరుస సినిమాలు చేస్తున్న ఎవర్ గ్రీన్ బ్యూటీ త్రిష.. తాజాగా తన పెళ్లిపై కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. ‘మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని అడిగితే నా దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకంటే అది పూర్తిగా నేను కలుసుకోబోయే వ్యక్తిపై ఆధారపడి ఉంటుంది. ఆ పర్సని చూసినప్పుడు ‘నేను ఇతనితో జీవితాంతం కలిసి జీవించగలను’ అనే ఫీల్ రావాలి. ఎందుకంటే నేను డివోర్స్‌ను నమ్మను. అసలు నాకు విడాకుల ప్రక్రియనే నచ్చదు. మ్యారేజ్ లైఫ్‌లో సంతోషంగా లేక తప్పుడు నిర్ణయాలతో విడాకులు తీసుకున్న వాళ్లను నేను చాలా మందిని చూశాను. అలాగే కొంత మంది చుట్టాల కోసం, పిల్లల కోసం, చుట్టుపక్కల వాళ్లకోసం నచ్చకపోయిన కలిసి బతికడం కూడా చూశాను. కాబట్టి నేను ఇవన్నీ అస్సలు తట్టుకోలేను. ఒకవేళ నేను పెళ్లి చేసుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ విడాకులు తీసుకోను. కేవలం సమాజం కోసమో, ఒంటరితనం భరించలేకో కాకుండా.. జీవితాంతం కలిసి ఉండే సరైన తోడు దొరికినప్పుడు కచ్చితంగా పెళ్లి చేసుకుంటా’ అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.






