- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థినులకు యూనిఫామ్‌లు అందజేయాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
ఏ మాత్రం ఆలస్యం చేయకుండా విద్యార్థినులకు వెంటనే యూనిఫామ్‌లు అందజేయాలని జిల్లా ప్రత్యేక అధికారి విజయేంద్ర, జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సిబ్బందిని ఆదేశించారు.

దిశ, దోమకొండ : ఏ మాత్రం ఆలస్యం చేయకుండా విద్యార్థినులకు వెంటనే యూనిఫామ్‌లు అందజేయాలని జిల్లా ప్రత్యేక అధికారి విజయేంద్ర, జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సిబ్బందిని ఆదేశించారు. శనివారం వారు దోమకొండ మండలంలోని సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా లేదా అని విద్యార్థినులను ప్రశ్నించడంతో పాటు, ఇతర సౌకర్యాలు, సమస్యలపై ఆరా తీశారు. వర్షాకాలంలో దోమలు ఎక్కువగా ఉంటాయని, అందువల్ల దోమతెరలను తప్పనిసరిగా వినియోగించుకోవాలని విద్యార్థినులకు సూచించారు.
యూనిఫామ్‌లు వెంటనే అందజేయాలని ఆదేశించారు. అయితే యూనిఫామ్‌ల వస్త్రం ఇంకా రాలేదని పాఠశాల సిబ్బంది తెలపగా, వస్త్రం వచ్చిన వెంటనే ఆలస్యం చేయకుండా కుట్టించి పంపిణీ చేయాలని సూచించారు. క్రమం తప్పకుండా హెల్త్ చెకప్‌లు నిర్వహించాలని, జిల్లాలో ఎక్కడైనా బాల్యవివాహాలు జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే తమకు సమాచారం అందజేయాలని సూచించారు. విద్యార్థినులకు ఏవైనా సమస్యలు ఉంటే భయపడకుండా తమ దృష్టికి తీసుకురావాలని వివరించారు. అనంతరం విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. ఉపాధ్యాయులు, వార్డెన్లు ప్రత్యేక శ్రద్ధ వహించి విద్యార్థినులకు సరైన మోతాదులో పోషకాహారం అందేలా చూడాలని ఆదేశించారు. అలాగే పాఠశాలలోని విద్యార్థినులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని పాఠశాల సిబ్బందిని ఆదేశించారు.






