Kotak Mahindra Bank: కోటక్ మహీంద్రా బ్యాంక్‌ సీఈఓ పదవికి అశోక్ వాస్వాని గుడ్‌బై

by S Gopi |

రిటైల్, కార్పొరేట్, పేమెంట్స్, కన్స్యూమర్ బ్యాంకింగ్ రంగాల్లో 35 ఏళ్లకు పైగా అంతర్జాతీయ అనుభవం ఉన్న ఆయన, గతంలో బార్‌క్లేస్, సిటీగ్రూప్ వంటి ఇంటర్నేషనల్ సంస్థల్లో పనిచేశారు.

Kotak Mahindra Bank: కోటక్ మహీంద్రా బ్యాంక్‌ సీఈఓ పదవికి అశోక్ వాస్వాని గుడ్‌బై
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలోనే నాలుగో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం కోటక్ మహీంద్రాలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. 2024 జనవరి 1న కోటక్ బ్యాంక్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన అశోక్ వాస్వాని తన పదవికి గుడ్‌బై చెప్పనున్నారు. రిటైల్, కార్పొరేట్, పేమెంట్స్, కన్స్యూమర్ బ్యాంకింగ్ రంగాల్లో 35 ఏళ్లకు పైగా అంతర్జాతీయ అనుభవం ఉన్న ఆయన, గతంలో బార్‌క్లేస్, సిటీగ్రూప్ వంటి ఇంటర్నేషనల్ సంస్థల్లో పనిచేశారు. తన పదవీకాలం ముగిశాక మళ్లీ ఆ సీటులో కొనసాగడానికి ఆయన ఆసక్తి చూపడం లేదు. వ్యక్తిగత కారణాల వల్ల ఈ ఏడాది డిసెంబర్ 31న తప్పుకోనున్నట్లు ఆయన శనివారం ప్రకటించడంతో, బ్యాంక్ బోర్డు ఆ ప్లేస్‌లోకి కొత్త వారసుడిని వెతికే పనిని అప్పుడే మొదలుపెట్టింది. వాస్తవానికి, రుణాల పంపిణీ పెరగడంతో 2025-26 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో బ్యాంక్ నికర లాభం ఏకంగా 13 శాతం పెరిగి రూ. 4,027 కోట్లకు చేరింది. అంతేకాదు, కోటక్‌ను లాభాల పరంగా ఇండియాలోనే నంబర్ 3 ప్రైవేట్ బ్యాంక్‌గా నిలబెట్టాలనే పట్టుదలతో ఉన్నట్టు అశోక్ వాస్వాని ఇదివరకు ప్రకటనలో తెలిపారు. ఆర్‌బీఐ రూల్స్ ప్రకారం నిర్ణీత గడువులోపు కొత్త సీఈఓ ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తామని బ్యాంక్ యాజమాన్యం స్పష్టం చేసింది.

Next Story