- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో మరో కస్టోడియల్ టార్చర్.. లాఠీలు విరిగేలా కొట్టారంటూ బాధితుడి ఆవేదన
విజయవాడ సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు రాష్ట్రంలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. సీఐ నాగరాజు సాయికృష్ణ అనే యువకుడిని స్టేషన్ లో టార్చర్ చేసి చనిపోయిన తరవాత డెడ్ బాడీని సైతం మాయం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు రాష్ట్రంలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. సీఐ నాగరాజు సాయికృష్ణ అనే యువకుడిని స్టేషన్ లో టార్చర్ చేసి చనిపోయిన తరవాత డెడ్ బాడీని సైతం మాయం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ కేసును సిట్ విచారిస్తుండగా ఇప్పటికే సీఐ నాగరాజుతో పాటు అతడికి సహకరించిన స్నేహితుడిని సైతం అరెస్ట్ చేసింది. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఇద్దరు కానిస్టేబుళ్లు ప్రస్తుతం పరారీలో ఉండగా వారికోసం పోలీసులు వెతుకుతున్నారు.
అయితే కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే మరో వ్యక్తి తనను పోలీసులు కస్టడీలో టార్చర్ చేశారంటూ మీడియా ముందుకు రావడం ఆందోళన కలిగిస్తోంది. నెల్లూరు జిల్లా కొండాపురం పోలీసులు తనను టార్చర్ చేశారని గణేశ్వరపురానికి చెందిన రవీంద్ర ఆరోపిస్తున్నారు. తనను ఎస్ఐ కాసుల శ్రీనివాసులు స్టేషన్‌కు తీసుకువెళ్లి కొట్టాడని బాధితుడు చెబుతున్నాడు. రెండు రోజుల పాటు తనను స్టేషన్ లోనే పెట్టి లాఠీలు విరిగేలా కొట్టారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసుల టార్చర్ తో తన ఒంటిపై అయిన గాయాలను చూపిస్తూ న్యాయం చేయాలని కోరారు.






