రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి దుర్మరణం

by Taduka Kalyani |

కొండాపూర్ ఫ్లైఓవర్ పై రాంగ్ రూట్ లో వచ్చిన స్కూటీని ఎదురుగా వచ్చిన మరో బైక్ ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన మరవక ముందే మరో ఘటన చోటు చేసుకుంది.

రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి  దుర్మరణం
X

దిశ, శేరిలింగంపల్లి : కొండాపూర్ ఫ్లైఓవర్ పై రాంగ్ రూట్ లో వచ్చిన స్కూటీని ఎదురుగా వచ్చిన మరో బైక్ ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన మరవక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖజాగూడ లేక్ రోడ్డులో, ఈఎస్‌సీఐ కాలేజీకి ఎదురుగా ఉన్న యూ-టర్న్ రోడ్డుకు వస్తుండగా అదే దిశలో వస్తున్న మరో బైక్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో డెలాయిట్‌ కంపెనీలో హెచ్‌ఆర్ అనలిస్ట్‌గా పనిచేస్తున్న అరవింద్ కుమార్ సింగ్ ( 27 ) అక్కడికక్కడే మృతి చెందినట్లు రాయదుర్గం ఇన్స్పెక్టర్ వెంకన్న తెలిపారు..గచ్చిబౌలి, రాజీవ్ గాంధీ నగర్, జేవీ కాలనీ, ఇయర్ వ్యూ అపార్ట్‌మెంట్స్, ఫ్లాట్ నెం.101లో నివాసం ఉంటున్న అతను TG07AG7495 రిజిస్ట్రేషన్ నంబర్ గల తన మోటార్‌సైకిల్‌పై గచ్చిబౌలిలోని కేర్ హాస్పిటల్ వైపు వస్తున్నాడు.ఈఎస్‌సీఐ కాలేజీ సమీపంలోని యూ-టర్న్ వద్దక అదే దిశలో ప్రయాణిస్తున్న TS07GX4523 రిజిస్ట్రేషన్ నంబర్ గల మరో మోటార్‌ సైకిల్‌ రైడర్ ఢీ కొట్టాడు.ఎలాంటి సిగ్నల్ ఇవ్వకుండా అకస్మాత్తుగా యూ-టర్న్ తీసుకోవడానికి ప్రయత్నించి పక్కనుంచి వెళ్తున్న మోటార్‌ సైకిల్‌ను ఢీకొట్టాడు. ప్రమాద తీవ్రతకు అబ్బి ఆనంద్ సింగ్ రోడ్డుపైకి ఎగిరిపడి అక్కడికక్కడే తీవ్ర గాయాలతో మరణించాడు.ఫిర్యాదు ఆధారంగా రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, దర్యాప్తు నిర్వహిస్తున్నారు. రోడ్డు ప్రమాదం కారణమైనన రైడర్‌ను గుర్తించి, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించాలని, అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయవద్దని, మలుపులు తిరిగేటప్పుడు, లేన్‌లు మార్చేటప్పుడు సరైన ఇండికేటర్లను ఉపయోగించాలని, ఐ ఎస్ ఐ మార్క్ ఉన్న హెల్మెట్‌లను ధరించాలని కోరారు.

Next Story