- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజిలెన్స్ సమాచారం లీక్.. వ్యవసాయ అధికారిణి సస్పెండ్
by Batti.Sumithra |
విజిలెన్స్ తనిఖీల సమాచారం డీలర్లకు ముందుగానే లీక్ చేశారనే ఆరోపణల పై జుక్కల్ వ్యవసాయ అధికారిణి మహేశ్వరిని సస్పెండ్ చేశారు.

X
దిశ, జుక్కల్ (నిజాంసాగర్) : విజిలెన్స్ తనిఖీల సమాచారం డీలర్లకు ముందుగానే లీక్ చేశారనే ఆరోపణల పై జుక్కల్ వ్యవసాయ అధికారిణి మహేశ్వరిని సస్పెండ్ చేశారు. గత నెల జుక్కల్‌లోని ఎరువులు, విత్తనాల దుకాణాల పై విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా, లక్షల రూపాయల విలువైన కాలం చెల్లిన ఎరువులు, బిల్లులు లేని స్టాక్ బయటపడింది. తనిఖీలకు ముందే డీలర్లకు సమాచారం ఇచ్చారనే ఫిర్యాదుల పై జిల్లా అధికారులు విచారణ నిర్వహించి, నివేదికను రాష్ట్ర కమిషనర్‌కు పంపారు. కమిషనర్ ఆదేశాల మేరకు మహేశ్వరిని సస్పెండ్ చేసినట్లు కామారెడ్డి డీఏఓ మోహన్‌రెడ్డి తెలిపారు. పూర్తిస్థాయి విచారణ కొనసాగుతోందని, తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఆమె సస్పెన్షన్‌లో కొనసాగుతారని పేర్కొన్నారు.
Next Story






