- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యుత్ షాక్‌తో వాటర్ ఫిల్టర్ టెక్నీషియన్ మృతి
సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని దేవ్ల తండాలో శనివారం మధ్యాహ్నం ఇంట్లో వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేస్తున్న సమయంలో విద్యుత్ షాక్‌కు గురై టెక్నీషియన్ మృతి చెందినట్లు పాలకవీడు ఎస్సై ఆర్. కోటేష్ తెలిపారు.

దిశ, నేరేడుచర్ల (పాలకవీడు): సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని దేవ్ల తండాలో శనివారం మధ్యాహ్నం ఇంట్లో వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేస్తున్న సమయంలో విద్యుత్ షాక్‌కు గురై టెక్నీషియన్ మృతి చెందినట్లు పాలకవీడు ఎస్సై ఆర్. కోటేష్ తెలిపారు. మిర్యాలగూడ పట్టణంలోని సీతారాంపురానికి చెందిన కోడి శ్రీకాంత్ (40) సాగర్ రోడ్డులో ఉన్న వాటర్ ఫిల్టర్ దుకాణంలో పనిచేస్తూ ఆక్వాగార్డ్ వినోవిక్ కంపెనీకి చెందిన వాటర్ ఫిల్టర్‌లను అమర్చే పని చేస్తున్నాడు. ఈ క్రమంలో దేవ్ల తండాకు చెందిన బానోత్ సలుకు ఇంట్లో వాటర్ ఫిల్టర్ ఫిట్ చేస్తుండగా, ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి తల్లి శకుంతల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై కోటేష్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజూర్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై విచారణ కొనసాగుతోందని ఎస్సై తెలిపారు.






