బిఎల్ఓల అటెండెన్స్‌ను అధికారులు పరిశీలించాలి: మేడ్చల్ జిల్లా కలెక్టర్ మను చౌదరీ

by Kodari Anjali |

బిఎల్ఓల అటెండెన్స్ ను అధికారులు పరిశీలించాలనీ మేడ్చల్ జిల్లా కలెక్టర్ మను చౌదరీ అధికారులను ఆదేశించారు.

బిఎల్ఓల అటెండెన్స్‌ను అధికారులు పరిశీలించాలి: మేడ్చల్ జిల్లా కలెక్టర్ మను చౌదరీ
X

దిశ, కూకట్ పల్లి: బిఎల్ఓల అటెండెన్స్ ను అధికారులు పరిశీలించాలనీ మేడ్చల్ జిల్లా కలెక్టర్ మను చౌదరీ అధికారులను ఆదేశించారు. కూకట్ పల్లి నియోజక వర్గంలో శనివారం ఎస్ఐఆర్ ప్రక్రియను జోనల్ కమిషనర్ మయాంక్ సింగ్‌తో కలిసి కేపిహెచ్బి కాలనీలో బిఎల్ఓలు ఇంటింటికి తిరిగి అందిస్తున్న ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మను చౌదరీ మాట్లాడుతూ ప్రతి రోజు ఉదయం అధికారులు బిఎల్ఓల అటెండెన్స్ తీసుకోవాలని అన్నారు. రోజు ఎన్ని ఎన్రోల్మెంట్ పాత్రలను ఇచ్చారా లేదా తెలుసుకోవాలని అన్నారు. ఒక్కొకరికి ఎన్ని ఎన్రోల్ మెంట్ పత్రాలు ఇచ్చారు, యాప్ ద్వారా అప్లోడ్ ఏవిధంగా చేస్తున్నారు అనే ప్రక్రియను అధికారులు పరిశీలించాలని అన్నారు. మ్యాపింగ్ కానీ వారి వివరాలను బిఎల్ఓలతో సమన్వయం చేసుకుంటూ ఎన్యూమరేషన్ పత్రాలను అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి తహసీల్దార్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Next Story