కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో అనుమతులు లేకుండా పాఠ్యపుస్తకాల అమ్మకాలు

by Kodari Anjali |

కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో అనుమతులు లేకుండా పాఠ్యపుస్తకాల అమ్మకాల్ని విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకున్నారు.

కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో అనుమతులు లేకుండా పాఠ్యపుస్తకాల అమ్మకాలు
X

దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో కొనసాగుతున్న శ్రీ కృష్ణవేణి టాలెంట్ ప్రైవేటు పాఠశాలలో ఎలాంటి అనుమతులు లేకుండా పాఠ్యపుస్తకాలు అమ్ముతున్న విషయం విద్యార్థి సంఘాలకు తెలవడంతో శనివారం పాఠశాలను విద్యార్థి సంఘాలు సందర్శించి అక్రమంగా పుస్తకాలు అమ్ముతున్నట్లు నిర్ధారించారు. వెంటనే విద్యార్థి సంఘాల నాయకులు మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసమూర్తికి సమాచారం అందించడంతో పాఠశాల వద్దకు చేరుకొని పుస్తకాలు అమ్ముతున్న విషయం వాస్తవం అని నిర్ధారించిన తర్వాత పాఠ్యపుస్తకాలు నిల్వ ఉంచిన గదిని ఎంఈఓ సీజ్ చేశారు. ఈ సందర్భంగా బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు డ్యాగ అనిల్ కుమార్ మాట్లాడుతూ.. ప్రైవేటు స్కూళ్లు విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటూ ఇష్టానుసారంగా పుస్తకాలను ముద్రించి అధిక రేట్లకు అమ్మకాలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులపై మరింత భారాన్ని మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

హెచ్చించిన కూడా గుడ్డిగా..

అలాగే ప్రభుత్వ అనుమతులు లేకుండానే ఇష్టమొచ్చినట్టు పాఠశాల యాజమాన్యాలు సొమ్ము చేసుకోవడమే ప్రధాన లక్ష్యంగా పాఠ్యపుస్తకాల అమ్మకాలు చేయడం దుర్మార్గమన్నారు. అలాగే పట్టణంలోని అనేక ప్రైవేటు పాఠశాలలు ధనార్జనే ధ్యేయంగా అధిక ఫీజులు వసూలు చేయడంతో పాటు పలానా పుస్తకాలు మా పాఠశాలలను కొనుగోలు చేయాలని విద్యార్థులకు ఆదేశించడంతో.. తప్పనిసరి పరిస్థితులలో వారు ఎంత రేటు హెచ్చించిన కూడా గుడ్డిగా విద్యార్థుల తల్లిదండ్రులు పుస్తకాలు కొనుగోలు చేయాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు అక్రమంగా పుస్తకాల అమ్మకాలు చేస్తున్న అన్ని పాఠశాలలపై తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పై పాఠశాలను సందర్శించిన ఎమ్ ఎస్ ఎఫ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బుక్కాపురం మహేష్ మాదిగ, యు ఎస్ ఎఫ్ ఐ రాష్ట నాయకులు సయ్యద్, ఉదయ్, ఆంజనేయులు ఉన్నారు.

Next Story