- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, మేడ్చల్ బ్యూరో: హైడ్రా భారీ అపరేషన్ చేపట్టింది. అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపింది. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా, బాలానగర్ మండల పరిధిలోని సర్వే నెంబర్ 1 చత్రి గడ్డ వద్ద శనివారం హైడ్రా భారీ అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. నిబంధనలకు విరుద్ధంగా వెలసిన కట్టాలను భారీ యంత్రాలతో సహాయంతో నేలమట్టం చేసింది. కూల్చివేతల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీసు బలగాలను రంగంలోకి దించింది. డీఆర్ఎఫ్, ఎస్ ఓటీ సిబ్బందిని మొహరించి,ఇతర వ్యక్తులను అనుమతించకుండా నాలుగు వైపులా భద్రతా వలయం ఏర్పాటు చేసి కూల్చివేతలు చేపట్టింది.
పురావస్తు శాఖ భూమి కబ్జా..
బాలానగర్ మండల పరిధిలోని హాస్మత్ పేట సర్వే నెంబర్ 1(ఛత్రీగడ్డ ప్రాంతం) లోని 108 ఎకరాల భూమి ప్రధానంగా ప్రభుత్వ పురావస్తు శాఖకు చెందింది.అందులో ఇప్పటికే దాదాపు 98 ఎకరాల భూమి కబ్జాకు గురైంది. మిగిలిన దాదాపు రూ.750 కోట్ల విలువైన 10 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి వేసిన తాత్కలిక షెడ్లు, ప్రి కాస్ట్ కంపౌండ్ వాల్స్ ను హైడ్రా నేలమట్టం చేసింది. ఈ అక్రమ నిర్మాణల్లో కబ్జాదారులు అక్రమించినవి కొన్ని ఉండగా, వారు పేదలకు మాయమాటలు చెప్పి గజాల్లో విక్రమించినవి ఉన్నాయి. అయితే హాస్మత్ పేటలో హైడ్రా భారీ యాక్షన్ తో పరిసర ప్రాంతాలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి. హస్మత్ పేట(బోయిని చెరువు) పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను కబ్జా చేసిన కబ్జారాయుళ్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి.
ప్రభుత్వ స్థలంలో రియల్ బిజినెస్..
పురావస్తు శాఖ స్థలాన్ని కొందరు అక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టడంతోపాటు 100,80 గజాల చొప్పున విక్రయాలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ భూకబ్జా వ్యవహారంలో కొందరు తాజా,మాజీ ప్రజాప్రతినిధుల పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రజా ప్రతినిధుల ముసుగులో సాగించిన భూ క్రయ విక్రయాల్లో అధికారికంగా ఏలాంటి నిర్దారణ కాకపోయిన,సంబంధిత లావాదేవీల పై విచారణ కొనసాగిస్తామని హైడ్రా అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులు, ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించిన స్థలాల పరిరక్షణలో భాగంగా అక్రమ నిర్మాణాలపై హైడ్రా కఠిన చర్యలు కొనసాగిస్తుందని తెలిపారు. అయితే అక్రమార్కుల మాయమాటలు నమ్మి 100,80,60 గజాల స్థలాలను కొనుగోలు చేసి ఇళ్లు కట్టుకున్న నిరు పేదల సమిథలవుతున్నారు.ప్రభుత్వ భూములను కబ్జా చేసి ప్లాట్లుగా విక్రయించి సోమ్ము చేసుకున్న ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు కట్టుకునేందుకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.






