ఇడుపు కాయితం పై రచ్చ.. క్లారిటీ ఇచ్చిన బన్నీ వాస్

by Chukka Sudharani |

టైటిల్ వివాదంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది ‘ఇడుపు కాయితం’.

ఇడుపు కాయితం పై రచ్చ.. క్లారిటీ ఇచ్చిన బన్నీ వాస్
X

దిశ , సినిమా: టైటిల్ వివాదంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది ‘ఇడుపు కాయితం’. ఈ సినిమా యాస, భాష, టైటిల్స్ విషయంలో రెండు వర్గాలుగా విడిపోయి సోషల్ మీడియాలో ఒకరినొకరు దూసించుకుంటున్నారు. ఈ క్రమంలోనే సినిమా నిర్మాత బన్నీ వాసు టైటిల్ వివాదంపై క్లారిటీ ఇచ్చారు. ‘ఏ సినిమాకైనా కథ, దాని నేపథ్యం బట్టే టైటిల్ ఉంటుంది. దీనిపై చర్చ అనవసరం. ఆంధ్రా, తెలంగాణ అని కాదు.. ఎవరైనా సరే సినిమా నచ్చితేనే చూస్తారు. నచ్చకపోతే చూడరు. కాబట్టి షూటింగ్ పూర్తయి విడుదలైన తర్వాత సినిమానే మాట్లాడుతుంది. కాబట్టి నేను చేయాల్సింది సినిమాను బాగా తీయడంపై దృష్టి పెట్టడమే. ప్రస్తుతం ఈ వివాదం వల్ల సినిమాకు కొంత ఇబ్బంది కలిగిన మాట నిజమే. సినిమా రిలీజ్ అయ్యాక అన్నీ అవే సర్దుకుంటాయి. ఫైనల్‌గా ఇది ఒక ప్రాంతానికి పరిమితమయ్యే కథ కాదు. ఒకవేళ ప్రాంతాన్ని బట్టి కథ ఉంటుందా? అంటే ఎక్కడో తీసిన హాలీవుడ్ మూవీ ఇక్కడ ఆడదు కదా.. ఇది ప్రతి ఇంటిలో ఉండే కథ. క్లైమాక్స్‌కు వచ్చే సరికి అత్తాకోడళ్లు, మామాఅల్లుళ్లు ఒకరి చేయి ఒకరు పట్టుకుని సంతోషంగా థియేటర్స్ నుంచి బయటకు వస్తారు. ఇది దర్శకుడు వచ్చిన ప్రాంతం, చూసిన వాస్తవ సంఘటనల నుంచి రాసుకున్న కథ. దీనిపై నాకు పూర్తి నమ్మకం ఉంది’ అంటూ తెలిపారు.

Next Story