తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: పార్టీ చీఫ్​ సంచలన జోస్యం

by Vemula.Srinu Prasad |

దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ ప్రవేశ పెట్టిన పథకాలు కేంద్ర ప్రభుత్వ విధానాలకు ఆకర్షితులై వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, యువత, మేధావులు బీజేపీలో చేరితున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్​రావు పేర్కొన్నారు. ..

తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: పార్టీ చీఫ్​ సంచలన జోస్యం
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ ప్రవేశ పెట్టిన పథకాలు కేంద్ర ప్రభుత్వ విధానాలకు ఆకర్షితులై వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, యువత, మేధావులు బీజేపీలో చేరితున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్​రావు పేర్కొన్నారు. శనివారం పార్టీ రాష్ట్ర కార్యాలయలో ఎయిర్‌లైన్ రంగానికి చెందిన ప్రముఖులు హరికృష్ణన్ , చంద్ర మోహన్ కాషాయం కప్పుకున్నారు. ఈసందర్బంగా మాట్లాడుతూ సమాజంలో ఒక గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న వ్యక్తి పార్టీకి చేరడం సంతోషకరంగా ఉందని, ఇటీవల ఐటీ రంగానికి చెందిన పలువురు యువకులు కూడా పార్టీ సిద్ధాంతాలను మెచ్చి చేరారు. పైలట్ వృత్తి అత్యంత క్రమశిక్షణ, బాధ్యత, నైపుణ్యం అవసరమైన గౌరవప్రదమైన వృత్తి. అలాంటి రంగానికి చెందిన వ్యక్తులు బీజేపీ వైపు రావడం పార్టీకి మరింత బలం చేకూరుస్తోంది.

తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ మూడు రోజుల పర్యటనకు సంబంధించి ఎగ్జిబిషన్​గ్రౌండ్​లో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ పర్యటన తెలంగాణ బీజేపీకి అత్యంత కీలకమైనది. నేటి నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాల ద్వారా తెలంగాణలో పార్టీ సంస్థాగత బలం, కార్యకర్తల ఉత్సాహం, రాబోయే రాజకీయ దిశ స్పష్టంగా కనిపించబోతున్నాయి. గతంలో నితిన్ నబిన్ తెలంగాణకు వచ్చినప్పటికీ, హైదరాబాద్ నగరంలో ఈ స్థాయిలో పార్టీ కార్యక్రమంలో పాల్గొనడం ఇదే మొదటిసారి. ఈ పర్యటన కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. రాబోయే తెలంగాణ అధికారమే లక్ష్యంగా పోరాటానికి ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండాలనే సంకల్ప నినాదం ఈ వేదిక నుంచి వినిపిస్తామన్నారు. ఇది కేవలం గ్రేటర్​నగరానికి మాత్రమే పరిమితమైన కార్యక్రమం కాదు. తెలంగాణ మొత్తం రాజకీయ భవిష్యత్తుకు ఇది నాంది. ఇక్కడి నుంచి రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ బలోపేతానికి కొత్త దిశ నిర్ణయించబడుతుంది. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే. జీహెచ్​ఎంసీ తో పాటు మల్కాజగిరి, సైబరాబాద్ ప్రాంతాల్లో కూడా బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మజ్లిస్, కాంగ్రెస్, బీఆర్‌ఎస్​కలిసిన తమ పార్టీ గెలుపును అడ్డుకోలేవన్నారు.

Next Story