- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముత్యపు కవచంలో మలయప్పస్వామి
తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం ప్రారంభమైన ఈ ఉత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి శనివారం ముత్యపు కవచం ధరించారు....

దిశ, వెబ్ డెస్క్: తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం ప్రారంభమైన ఈ ఉత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి శనివారం ముత్యపు కవచం ధరించారు. అనంతరం నాలుగు మాడ వీధులలో ఊరేగుతూ భక్తులను దర్శనం భాగ్యం కల్పించారు. శనివారం ఉదయం 6.30 గంటలకు మలయప్పస్వామివారు ఉభయనాంచారులతో కలిసి శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారానికి వేంచేపు చేశారు. ఉదయం 8 గంటలకు ఆలయ అర్చకులు, వేదపారాయణదారులు శాస్త్రోక్తంగా మహాశాంతి హోమం నిర్వహించారు. అనంతరం ఉదయం 9 నుండి 11 గంటల వరకు మలయప్ప స్వామివారికి, దేవేరులకు అభిదేయక అభిషేకాన్ని కన్నులపండుగగా చేపట్టారు.
వేడుకగా ముత్యపు కవచ సమర్పణ
ఇక సాయంత్రం మలయప్పస్వామివారికి ముత్యపు కవచ సమర్పణ వేడుకగా జరిగింది. అనంతరం సహస్రదీపాలంకార సేవలో స్వామి ముత్యపు కవచంలో భక్తులను మురిపించారు. సంవత్సరంలో ఒకమారు మాత్రమే ముత్యపు కవచాన్ని ధరించిన స్వామివారి ముగ్దమనోహర రూపాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు.






