- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతి తాండాలో సేవాలాల్ ఆలయం నిర్మిస్తా: వనపర్తి ఎమ్మెల్యే
గిరిజనులను గుండెలలో పెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ నేనని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శివసేన రెడ్డి అన్నారు.

దిశ, వనపర్తి: గిరిజనులకు రిజర్వేషన్ హక్కు కల్పించిన, దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన చరిత్ర కలిగిన కుటుంబసభ్యులు ఇందిరమ్మ మనవడు ఎంపీ రాహుల్ గాంధీని భావి భారతదేశానికి ప్రధానమంత్రిని చేసేందుకు గిరిజన జాతి బిడ్డలు సమిష్టిగా కృషి చేయాలనీ "జాగోరే బంజారా... మరోరే..నగారా" వరంగల్ ఎంపీ బలరాం నాయక్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులకు రిజర్వేషన్ కల్పించి 50 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా చేపట్టిన ఇందిరమ్మ బస్సు యాత్ర శనివారం మధ్యాహ్నం వనపర్తి జిల్లా కేంద్రానికి చేరుకుంది. బస్సు యాత్రను స్థానిక శాసనసభ్యులు తూడీ మేఘారెడ్డి, జిల్లా అధ్యక్షులుఆధ్వర్యంలో గిరిజన ప్రజాప్రతినిధులు, నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఎంపీ బలరాం నాయక్, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, రాంచంద్ర నాయక్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ బస్సు యాత్రలో కొనసాగుతున్నారు. ఇందిరమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి, రాజీవ్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన రోడ్ షోలో వారు మాట్లాడుతూ, గిరిజనులు విద్యావంతులుగా, ఉన్నతస్థాయి ఉద్యోగస్తులుగా, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, మంత్రులుగా ఎదిగేందుకు కాంగ్రెస్ పార్టీ, భారత దేశ మాజీ ప్రధాన మంత్రి ఇందిరమ్మ గిరిజనులకు కల్పించిన రిజర్వేషన్ పుణ్యమే నని ఎం.ఎల్.సీ కేతావత శంకర్ నాయక్అన్నారు. గిరిజన, ఎరుకలి, యానాది తెగలకు గుర్తింపు కల్పించిన ఘనత మాజీ ప్రధానమంత్రి ఇందిరమ్మకే దక్కుతుందన్నారు.
ప్రతి తండాలో సేవాలాల్ ఆలయం.. ఎమ్మెల్యే మేఘా రెడ్డి
స్థానిక ఎమ్మెల్యే మేఘా రెడ్డి మాట్లాడుతూ.. వనపర్తి లో గల 32 గిరిజన గ్రామ పంచాయతీలలో మౌలిక వసతులు విద్యుత్, రోడ్లు, త్రాగునీటీ సౌకర్యం సమకూర్చాలని తెలిపారు. భవిష్యత్తులో తండాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యపడుతుందన్నారు. ప్రతి గిరిజన తండాలో సేవాలాల్ ఆలయాన్ని నిర్మించే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు.
గిరిజనులను గుండెలలో పెట్టుకుంది.. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శివసేన రెడ్డి
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శివసేన రెడ్డి మాట్లాడుతూ.. 50 సంవత్సరాల క్రితం గిరిజన వర్గ ప్రజలను రిజర్వేషన్ కల్పించి జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు. సామాజిక ఆర్థిక రాజకీయ ఎదుగుదలకు కాంగ్రెస్ పార్టీ పునాదులువేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, శంకర్ నాయక్, సర్పంచి వాల్య నాయక్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఆదిత్య, వనపర్తి జిల్లా స్థాయి కాంగ్రెస్ గిరిజన సంఘం నాయకులు, ప్రజా ప్రతినిధులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.






