రోడ్డు పై కూరగాయలు పెట్టి అమ్మితే జరిమానా

by Taduka Kalyani |

వాహన దారులకు ఇబ్బందులు కలిగేలా కూరగాయలను రోడ్డు పై పెట్టి అమ్మితే జరిమానా విధిస్తామని మున్సిపల్ కమిషనర్ సాయికుమార్ కూరగాయల వ్యాపారస్తులను హెచ్చరించారు.

రోడ్డు పై కూరగాయలు పెట్టి అమ్మితే జరిమానా
X

దిశ, నర్సాపూర్ : వాహన దారులకు ఇబ్బందులు కలిగేలా కూరగాయలను రోడ్డు పై పెట్టి అమ్మితే జరిమానా విధిస్తామని మున్సిపల్ కమిషనర్ సాయికుమార్ కూరగాయల వ్యాపారస్తులను హెచ్చరించారు. శనివారం నర్సాపూర్ మున్సిపాలిటీలో మార్కెట్ రోడ్డులో కూరగాయల విక్రయదారులు రోడ్డును ఆక్రమించి కూరగాయలు విక్రయించడం వల్ల వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, పట్టణ ప్రజల ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ సాయికుమార్ కూరగాయల విక్రయదారులతో చర్చించి వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా రోడ్డు పై నుంచి వెనకకు పెట్టించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులకు ఇబ్బందులు కలిగేలా రోడ్డు పై దుకాణాలు తిరిగి పెడితే జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్చార్జి సల్ల మురళి, వార్డు అధికారి ఉదయ్, సిబ్బంది ఎల్లయ్య, అశోక్ తదితరులు ఉన్నారు.

Next Story