ములుగు జిల్లా రైస్ మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలని మంత్రి సీతక్కకు వినతి

by Kodari Anjali |

జిల్లాలోని రైస్ మిల్లర్లు సమస్యలతో సతమతం అవుతున్నామని రైస్ మిల్లర్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని నాయకులు మంత్రి సీతక్కకు వినతిపత్రం అందజేశారు.

ములుగు జిల్లా రైస్ మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలని మంత్రి సీతక్కకు వినతి
X

దిశ, ములుగు జిల్లా ప్రతినిధి: జిల్లాలోని రైస్ మిల్లర్లు సమస్యలతో సతమతం అవుతున్నామని, ప్రభుత్వం స్పందించి రైస్ మిల్లర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని రైస్ మిల్ అసోసియేషన్ ములుగు జిల్లా అధ్యక్షులు బాదం ప్రవీణ్ కోరారు. శనివారం రైస్ మిల్లర్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని నాయకులు మంత్రి సీతక్కకు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా అసోసియేషన్ అధ్యక్షులు బాదం ప్రవీణ్ మాట్లాడుతూ.. జిల్లాలో గత 2024- 25 రబీ సీజన్ లో 78 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రోక్యుర్మెంట్ జరిగిందని, ఈసారి అనూహ్యంగా దిగుబడి పెరిగి లక్ష 13వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగిందని, వివరించారు. వరి ధాన్యాన్ని నిల్వ చేయడానికి గోదాం లేకపోవడంతో ఆరుబయట నిలువ చేయడం జరిగిందని, అకాల వర్షాలకు ధాన్యం నాణ్యత కోల్పోవడంతో అధికారులు కొనే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి జిల్లాకు బాయిల్డ్ బియ్యం ఎఫ్సీఐకి పెట్టుటకు అనుమతి ఇప్పించాలని కోరారు. మిల్లర్ల సమస్యలను విన్న మంత్రి సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో కార్యదర్శి సహోదరు రెడ్డి, కోశాధికారి ఎలగందుల మోహన్, గౌరవ అధ్యక్షులు పల్లెపాటి సంగిరెడ్డి, గౌరవ సలహాదారులు రాణి శ్రవణ్ కుమార్, అనిల్ కుమార్ పాల్గొన్నారు.

Next Story