- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిన్నారుల ఆరోగ్యమే లక్ష్యం.. రేపు పల్స్ పోలియో కార్యక్రమం
జాతీయ టీకాకరణ దినోత్సవం (నేషనల్ ఇమ్యునైజేషన్ డే) సందర్భంగా ఆదివారం జిల్లాలో పల్స్ పోలియో టీకా కార్యక్రమం విస్తృతంగా చేపట్టడం జరుగుతుందని హైదరాబాద్ కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా తెలిపారు.

దిశ, హైదరాబాద్ బ్యూరో: జాతీయ టీకాకరణ దినోత్సవం (నేషనల్ ఇమ్యునైజేషన్ డే) సందర్భంగా ఆదివారం జిల్లాలో పల్స్ పోలియో టీకా కార్యక్రమం విస్తృతంగా చేపట్టడం జరుగుతుందని హైదరాబాద్ కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పోలియో బూత్‌లలో 0-5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఉచితంగా పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని, పిల్లల తల్లిదండ్రులు కేంద్రాలలో పిల్లలకు తప్పక పోలియో చుక్కలు వేయించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ఐదేండ్ల లోపు పిల్లలు 5,04,803 మంది ఉన్నారని, వీరి కోసం మొత్తం 2,800 పోలియో బూత్‌లు, 38 ట్రాన్సిట్ బూత్‌లు (రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, మెట్రో స్టేషన్లు తదితర ప్రాంతాల్లో) ఏర్పాటు చేయడం జరిగిందని, 91 మొబైల్ బృందాలు పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంంటున్నట్లు ఆమె వెల్లడించారు.
జిల్లాలో 193 అధిక ప్రమాద (హై రిస్క్) ప్రాంతాలు ప్రత్యేకంగా గుర్తించడం జరిగిందని తెలిపారు. నిర్మాణ ప్రదేశాలు, వలస కూలీల కాలనీలు, సంచార జాతులు, యాచకుల నివాస ప్రాంతాలు, మార్కెట్లు, దేవాలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలు, ఉద్యానవనాలు తదితర ప్రాంతాలలో ప్రత్యేక బృందాలు సేవలందిస్తాయన్నారు. జిల్లా ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, ఉపాధ్యాయులు, నర్సింగ్ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు అలాగే ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బంది మొత్తం 11,500 మందికి పైగా ఈ కార్యక్రమ నిర్వహణకు నియమించడం జరిగిందని పేర్కొన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక పర్యవేక్షణ బృందాలు కార్యక్రమాన్ని నిరంతరం పర్యవేక్షించి ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, పిల్లలకు పోలియో చుక్కలు వేయించడం తల్లిదండ్రుల బాధ్యత అని కలెక్టర్ గుర్తు చేశారు .






