- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > రంగారెడ్డి > శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో చిరుత కలకలం.. వదంతేనని తేల్చిన అధికారులు
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో చిరుత కలకలం.. వదంతేనని తేల్చిన అధికారులు
by Taduka Kalyani |
శంషాబాద్ విమానాశ్రయ పరిసరాల్లో చిరుత కనిపించిందన్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని అధికారులు స్పష్టం చేశారు.

X
దిశ, శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయ పరిసరాల్లో చిరుత కనిపించిందన్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని అధికారులు స్పష్టం చేశారు. విమానాశ్రయ నర్సరీ ప్రాంతం సమీపంలో చిరుత పులి అడుగుల గుర్తులు (పగ్ మార్క్స్) కనిపించినట్లు నిర్ధారణ లేని సమాచారం రావడంతో హైదరాబాద్ విమానాశ్రయ అధికారులు వెంటనే అటవీ శాఖ, వన్యప్రాణి నిర్వహణ, జూ అధికారులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న అధికారులు సంయుక్తంగా ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. చిరుతపులి సంచరించినట్లు ఎలాంటి ఆనవాళ్లు, ఆధారాలు లభించలేదని తేల్చారు. దీంతో ఎయిర్‌పోర్ట్ ప్రాంతంలో చిరుత సంచరిస్తోందన్న వార్తలు పూర్తిగా అవాస్తవమని అధికారులు స్పష్టం చేశారు. పుకార్లను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
Next Story






