- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏకలవ్య పాఠశాలలో మౌలిక వసతులు అరకొర..?
విద్యా సంవత్సరం ఆరంభంలోనే ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాలలో నీటి కొరత ఉండటంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.

దిశ, బయ్యారం: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏజెన్సీలో విద్యార్థుల భవిష్యత్తు కోసం కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి వారి విద్యాభ్యాసాన్ని అందించేందుకు కృషిచేసిన విద్యార్థులకు అందని ద్రాక్షలా మారింది. వివరాల్లోనికి వెళితే.. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని నామాలపాడు గ్రామములో తెలంగాణ ప్రభుత్వం సుమారుగా 10 కోట్ల రూపాయలు వెచ్చించి ఏకలవ్య రెసిడెన్షియల్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలను ఏర్పాటు చేశారు. పాఠశాల నిర్మాణం నుండి నేటి వరకు విద్యార్థులకు సరైన నీటి సదుపాయం లేక అనేక అవస్థలు పడుతున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 2025- 26 సంవత్సరానికి గాను పాఠశాల ప్రారంభమైన పాఠశాలలో విద్యార్థులు సుమారు 300 నుంచి 400 వరకు అడ్మిషన్లు తీసుకున్నట్లు సమాచారం. పాఠశాలలో కనీస వసతులైన నీరు లేక విద్యార్థులు పాఠశాలలో చేరేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
కలెక్టర్ విద్యార్థుల సమస్యలను గమనించి..
విద్యార్థులు ఉదయం లేవగానే కాల కృత్యాలు, స్నాన, పానీయాలు అవసరం ఉంటాయి. అదే విధంగా రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులకు ఉదయంటిఫిన్, భోజన వసతిని ఏర్పాటు చేసేందుకు నీరు ఎంతో అవసరం ఉండటంతో విద్యార్థులు స్నానాలు రెండు మూడు రోజులకు ఒకసారి స్నానాలు ఆచరించడం జరుగుతుందని విద్యార్థుల నుంచి ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థినీలు మరింత అవస్థలు పడుతున్నట్లు సమాచారం. 2024 -25 సంవత్సరానికి గాను గత జిల్లా కలెక్టర్ విద్యార్థుల సమస్యలను గమనించి నిధులు మంజూరు చేసి బోరుబావిని తొవ్వించి, మోటార్ నిర్మాణం గావించి పైప్ లైన్ ద్వారా పాఠశాలకు నీటిని సప్లై చేస్తున్న ఆ నీరు సక్రమంగా విద్యార్థులకు సరిపడా అందడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
సంబంధిత అధికారులు స్పందించి...
పాఠశాలకు మిషన్ భగీరథ నీరు వారం రోజులుగా రావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. సదరు కాంట్రాక్టర్ బోరు నిర్మాణంలో తక్కువ లోతులో బోర్ వేసి , మోటర్ బిగించి బిల్లులు కాజేశారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలకు నీరు రోజు మౌళిక,ఇతర అవసరాలకు వంటలకు మాత్రం నీరు చేరడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులు స్పందించి విద్యా సంవత్సరానికి గాను వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాలకు నీరు అందించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని విద్యార్థుల పేరెంట్స్ గ్రామస్తులు కోరుతున్నారు. దీనిపై ఏకలవ్య ప్రిన్సిపాల్ అశోకు వివరణ కోసం ప్రయత్నం చేయగా.. వారి మొబైల్ ఇన్కమింగ్ సర్వీస్ అందుబాటులో లేదని తెలుస్తుంది.






