- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రాలు దాటిన నిత్య పెళ్లికూతురు లీలలు.. అలాంటి పురుషులే టార్గెట్!
ఒకప్పుడు పెళ్లి అంటే ఏంతో పవిత్రమైనది. ఒకసారి పెళ్లి చేసుకుంటే జీవితాంతం వారితోనే కలిసి ఉండేవాళ్లు. కానీ ఇప్పుడు పెళ్లంటేనే లెక్కలేకుండా పోయింది. అవసరానికి పెళ్లి చేసుకుని అవసరం తీరాక విడిపోతున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఒకప్పుడు పెళ్లి అంటే ఏంతో పవిత్రమైనది. ఒకసారి పెళ్లి చేసుకుంటే జీవితాంతం వారితోనే కలిసి ఉండేవాళ్లు. కానీ ఇప్పుడు పెళ్లంటేనే లెక్కలేకుండా పోయింది. అవసరానికి పెళ్లి చేసుకుని అవసరం తీరాక విడిపోతున్నారు. సెలబ్రెటీలే కాకుండా సాధారణ ప్రజలు కూడా అలాగే తయారయ్యారు. మరికొందరు అయితే పెళ్లి పేరుతో క్యాష్ చేసుకుంటున్నారు. కాసుల కోసమే పెళ్లి చేసుకుని డబ్బులు కాజేసి మరొకరిని పెళ్లాడుతున్నారు. తాజాగా అలాంటి నిత్య పెళ్లి కూతురు వ్యవహారమే బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా పెద్దవడుగూరులో ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లాడుతూ మోసాలకు పాల్పడుతున్న మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు.
వజ్రపు మణి అనే మహిళ విజయవాడకు చెందిన కొందరు మధ్యవర్తులతో కలిసి ముఠాగా ఏర్పడి మోసానికి పాల్పడుతున్నట్టు గుర్తించారు. మొదట ముఠా సభ్యులు మహిళకు ఓ పెళ్లి సంబంధం చూస్తారు. ఏజ్ బార్ అవుతున్నా పెళ్లి కాని అబ్బాయిలు లేదంటే భర్య విడిచిపెట్టడం లేదా మరణించడంతో ఒంటరిగా మిగిలిపోయిన పురుషులనే వీరు టార్గెట్ చేస్తారు. ముందుగా పెళ్లికి ఎదురుకట్నం డిమాండ్ చేసి ఆ డబ్బులు ఇచ్చిన తరవాత ఉడాయిస్తారు.
ఇప్పటి వరకు ఇలా మహిళ ఐదు పెళ్లిళ్లు చేసుకున్నట్టు విచారణలో తేలింది. పెళ్లి చేసుకుని కొద్దిరోజులు కలిసి ఉండి తరవాత అక్కడ నుండి పారిపోయి మరొకరిని పెళ్లాడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. గతేడాది కాసేపల్లికి చెందిన సుధీర్‌రెడ్డి అనే వ్యక్తిని పెళ్లాడి ఆ తరవాత డబ్బులు తీసుకుని మాయమైంది. బాధితుడి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. తాజాగా కర్ణాటకకు చెందిన మరో వ్యక్తిని పెళ్లాడి ఆరు రోజులకే మదనపల్లెకు పారిపోతుండగా చీకలబైలు వద్ద పట్టుకున్నారు. నిత్య పెళ్లి కూతురు లీలలపై విచారణ జరుపుతున్నారు.






