పని ప్రదేశాల్లో మహిళలకు భద్రత కల్పించాలి

by Taduka Kalyani |

తెలంగాణ పోలీస్ అకాడమీలో శనివారం 112 మంది ప్రొబేషనరీ డీఎస్పీలకు "పని ప్రదేశాల్లో మహిళల భద్రత – చట్ట అమలు, మహిళలు ఎదుర్కొనే సమస్యలు" అంశంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

పని ప్రదేశాల్లో మహిళలకు భద్రత కల్పించాలి
X

దిశ, గండిపేట: తెలంగాణ పోలీస్ అకాడమీలో శనివారం 112 మంది ప్రొబేషనరీ డీఎస్పీలకు "పని ప్రదేశాల్లో మహిళల భద్రత – పిఓఎస్హెచ్( ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హరాస్మెంట్) చట్టం అమలు, మహిళలు ఎదుర్కొనే సమస్యలు" అంశంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్ ఆహ్వానం మేరకు సీఐడీ డీజీపీ చారు సిన్హా ముఖ్య అతిథిగా హాజరై పోష్ చట్టం ప్రాముఖ్యతను వివరించారు. మహిళలపై లైంగిక వేధింపులు కేవలం ప్రత్యక్ష చర్యల రూపంలోనే కాకుండా, మాటలు, ప్రవర్తన, సంకేతాలు వంటి పలు రూపాల్లో ఉండవచ్చని పేర్కొన్నారు. అలాంటి సంఘటనలను సకాలంలో గుర్తించి చట్టపరమైన రక్షణ వ్యవస్థలను వినియోగించుకోవాలని సూచించారు.

అనంతరం విమెన్ సేఫ్టీ వింగ్ కౌన్సిలర్ ఇషా శర్వాణి మహిళలు ఉద్యోగ జీవితంలో ఎదుర్కొనే మానసిక, సామాజిక, వృత్తిపరమైన సవాళ్లు, లైంగిక వేధింపుల వివిధ రూపాలు, వాటిని ఎదుర్కొనే మార్గాలపై అవగాహన కల్పించారు. సురక్షితమైన, గౌరవప్రదమైన కార్యాలయ వాతావరణం కల్పించడంలో పోలీసు అధికారుల పాత్ర అత్యంత కీలకమని వక్తలు పేర్కొన్నారు. కార్యక్రమానికి డీఎస్పీ సతీష్ లైజన్ అధికారిగా వ్యవహరించారు.


Next Story