- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
రైతులకు అన్ని విధాలుగా ఆదుకుంటూ అండగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తుందని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు.

దిశ, మంచిర్యాల: రైతులకు అన్ని విధాలుగా ఆదుకుంటూ అండగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తుందని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. శనివారం బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ యాడ్ లో నూతన కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని ఏఎంసి ఏరియా నుంచి కన్నాల ఫ్లైఓవర్ వ్యవసాయ శాఖ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రత్నం.సుకుమారి, వైస్ చైర్మన్ రవీందర్రావు లతో ఎమ్మెల్యే సమక్షంలో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశానికి అన్నం పెట్టే రైతన్నల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర, పారదర్శకమైన సేవలు అందిస్తుందన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంలోని ఏడు మండలాలకు బెల్లంపల్లి నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ లు అందుబాటులో ఉంటూ రైతులకు సేవలు అందించాలని అన్నారు. అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ లను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా డిసిసి అధ్యక్షుడు పిన్నింటి.రఘునాథ్ రెడ్డి, బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ దావా.స్వాతి రమేష్, వైస్ చైర్మన్ రాగం శెట్టి. సతీష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ భాస్కర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.






