- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్షణికావేశంతో గడ్డి మందు తాగి యువకుడు ఆత్మహత్య
by Kodari Anjali |
క్షణికావేశంతో ఓ యువకుడు గడ్డి మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

X
దిశ, వెల్గటూర్: క్షణికావేశంతో ఓ యువకుడు గడ్డి మందు తాగి బలవన్మరణానికి గురైన హృదయ విదారక ఘటన ఘటన ముత్తునూరు గ్రామంలో చోటుచేసుకుంది. వెల్గటూర్ మండలం మత్తునూర్ గ్రామానికి చెందిన మేడి ఆదర్శ్ (21) అనే యువకుడిని పెద్దలు మందలించారనే చిన్న కారణంతో క్షణికావేశానికి లోనై గడ్డి మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడి శనివారం మృతి చెందాడు. తన అమ్మగారి ఊరు కుక్కల గూడూరుకు వెళ్లగా.. అక్కడ వారి బంధువులు మందలించారని మనస్తాపం చెంది పురుగుల మందు సేవించాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని వెంటనే ఆసుపత్రి కి తరలిస్తుండగానే మృతి చెందారు. ఇతని మృతికి గల కారణాలు పూర్తిగా తెలియ రాలేదు.
Next Story






