మహేష్ బాబును రౌండప్ చేస్తున్న దర్శకులు.. ఎన్ని సినిమాలు లైన్లో పెట్టాడంటే?

by Chukka Sudharani |

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిన వారణాసి షూటింగ్ ఫినిష్ అవుతున్న నేపథ్యంలో మహేష్ బాబు తదుపరి ప్రాజెక్ట్‌పై ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ డిస్కషన్స్ స్టార్ట్ అయ్యాయి.

మహేష్ బాబును రౌండప్ చేస్తున్న దర్శకులు.. ఎన్ని సినిమాలు లైన్లో పెట్టాడంటే?
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘వారణాసి’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ ఫినిష్ అవుతున్న నేపథ్యంలో మహేష్ బాబు తదుపరి ప్రాజెక్ట్‌పై ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ డిస్కషన్స్ స్టార్ట్ అయ్యాయి. రాజమౌళి రూపొందిస్తున్న ‘వారణాసి’ సినిమా భారీ అంచనాలున్న ప్రాజెక్ట్ కావడంతో.. మహేష్ బాబు కూడా అందుకు తగ్గట్టుగా బాడీని సెట్ చేసుకుంటున్నాడు. అంతేకాకుండా తన లుక్ సైతం ఫుల్‌గా మార్చేశాడు. దీంతో టాప్ దర్శకులంతా మహేష్‌ను కొత్త కథలతో లైనప్ రెడీ చేస్తున్నారని గట్టిగా టాక్ వినిపిస్తోంది. ఇంకో విషయం ఏంటంటే టాప్ నుంచి మిడ్ రేంజ్ డైరెక్టర్లు సైతం ఇప్పటికే మన సూపర్ స్టార్‌కు స్క్రిప్ట్‌లు వినిపించినట్లు సమాచారం. గ్లోబల్ రీచ్ ఉన్న కమర్షియల్ + కంటెంట్ ఓరియెంటెడ్ కథలకే మహేష్ ప్రాధాన్యం ఇస్తున్నారని తెలుస్తుండగా.. మరి లక్కీ డైరెక్టర్ ఎవరు అనేది త్వరలో క్లారిటీ రానుందని వినికిడి. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్టులు నెట్టింట వైరల్ అవుతుండగా.. మహేష్ బాబు ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Next Story