- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసి తెలంగాణ జలహక్కులు కాపాడాలి : మాజీ మంత్రి పువ్వాడ
ఏపీ సీఎం చంద్రబాబు చెప్పినట్లు విని తెలంగాణకు రావాల్సిన కృష్ణా, గోదావరి నదీజలాల హక్కులను పోగొట్టుకుంటే భవిష్యత్తు తరాలు క్షమించవని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హితవు పలికారు.

దిశ, భద్రాచలం : ఏపీ సీఎం చంద్రబాబు చెప్పినట్లు విని తెలంగాణకు రావాల్సిన కృష్ణా, గోదావరి నదీజలాల హక్కులను పోగొట్టుకుంటే భవిష్యత్తు తరాలు క్షమించవని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హితవు పలికారు. శనివారం భద్రాచలం నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తైతే భద్రాచలం పట్టణం ముంపుకు గురయ్యే అవకాశం ఉందని, గతంలో తాను మంత్రిగా ఉన్నప్పుడే ఇదే అంశాన్ని లేవనెత్తానని గుర్తు చేశారు.
2028–29 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి 50 లక్షల క్యూసెక్కుల నీటిని ఆంధ్ర ప్రాంత ప్రజలకు అందిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు చెబుతున్నారని, కానీ భద్రాచలం ముంపు సమస్యపై సీఎం రేవంత్ రెడ్డి కనీసం పట్టించుకున్న దాఖలాలు కూడా లేవని విమర్శించారు. ఈ అంశంపై నష్టాలపై సమీక్ష కూడా నిర్వహించలేదని మండిపడ్డారు. పోలవరం వల్ల భద్రాచలంలో ఏర్పడే ముంపు సమస్యపై సమగ్ర సర్వే నిర్వహించి, నివారణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలవరం కారణంగా భద్రాచలం ముంపు నివారణకు తీసుకోవాల్సిన చర్యల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైనా లేదని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శించారు. సీతారామ ప్రాజెక్టు కేసీఆర్ మానసపుత్రిక అని, ఖమ్మం జిల్లా ప్రజలకు, రైతులకు వరప్రదాయినిలాంటిదని అన్నారు. ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు కేసీఆర్ సీతారామ ప్రాజెక్టును రూపకల్పన చేశారని పేర్కొన్నారు. నదీజలాల హక్కులు సాధించాలంటే, గిరిజన ప్రాంతాలను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.






