మానసిక వేధింపుల కేసులో కీలక తీర్పు.. ఐదుగురికి శిక్ష ఖరారు

by Batti.Sumithra |

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల కేంద్రంలోని నెహ్రూ నగర్‌కు చెందిన తగరం ముత్యాలరావు ఆత్మహత్య కేసులో ఐదుగురు నిందితులకు జైలు శిక్ష ఖరారు కావడంతో బాధిత కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

మానసిక వేధింపుల కేసులో కీలక తీర్పు.. ఐదుగురికి శిక్ష ఖరారు
X

దిశ, అశ్వారావుపేట : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల కేంద్రంలోని నెహ్రూ నగర్‌కు చెందిన తగరం ముత్యాలరావు ఆత్మహత్య కేసులో ఐదుగురు నిందితులకు జైలు శిక్ష ఖరారు కావడంతో బాధిత కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో శనివారం అశ్వారావుపేట సీఐ పింగళి నాగరాజు, ఎస్సై యాయాతి రాజులను మృతుడు తగరం ముత్యాలరావు కుటుంబ సభ్యులు శాలువాతో సన్మానించారు. స్థానిక కెమిలాయిడ్స్ ఫ్యాక్టరీలో పనిచేసే తగరం ముత్యాలరావు భార్య శ్యామల, తగరం వెంకటేశ్వరరావు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని భర్తను మానసికంగా హింసించింది. మనస్తాపానికి గురైన తగరం ముత్యాలరావు 2018 జూలై 31న మామిడి తోటలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

నాటి ఎస్సై వేల్పుల వెంకటేశ్వరరావు 14 మందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కోర్టులో వాదోపవాదాలు అనంతరం నిందితులైన భార్య శ్యామలకు ఏడు సంవత్సరాలు, ఆమె ప్రియుడు వెంకటేశ్వరరావుకు పది సంవత్సరాలు, అతని బంధువులు తగరం పుల్లారావుకు ఐదు సంవత్సరాలు, రామారావు, నరసింహులకు మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు, నిందితులందరికీ రూ.10 వేల జరిమానా విధిస్తూ కొత్తగూడెం అదనపు అసిస్టెంట్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి కవిత ఇటీవల తీర్పు వెలువరించారు. నిందితులకు జైలు శిక్ష ఖరారు కావడంతో మృతుడు తగరం ముత్యాలరావు ఆత్మకు శాంతి చేకూరిందని ఆయన తల్లి తగరం తిరుపతమ్మ హర్షం వ్యక్తం చేశారు. నాటి ఎస్సైలు వేల్పుల వెంకటేశ్వరరావు, మధు ప్రసాద్, కోర్టు కానిస్టేబుళ్లు నాగేశ్వరరావు, ప్రశాంత్ నిందితులకు శిక్ష పడడంలో చొరవ చూపారని వారికి కృతజ్ఞతలు తెలిపారు.

Next Story