అంతా మీ ఇష్టమేనా.. ఆసుపత్రి పర్యవేక్షకుడిపై కలెక్టర్ అసహనం..

by Taduka Kalyani |

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో విధులకు గైర్హాజరైన ఆసుపత్రి పర్యవేక్షకుడిపై జిల్లా కలెక్టర్ హరిత తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

అంతా మీ ఇష్టమేనా.. ఆసుపత్రి పర్యవేక్షకుడిపై కలెక్టర్ అసహనం..
X

దిశ, ఆసిఫాబాద్: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో విధులకు గైర్హాజరైన ఆసుపత్రి పర్యవేక్షకుడిపై జిల్లా కలెక్టర్ హరిత తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. శనివారం ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆమె, రికార్డులను పరిశీలించే సమయంలో పర్యవేక్షకుడు విధులకు హాజరుకాలేదని గుర్తించారు. దీంతో వెంటనే ఫోన్‌లో మాట్లాడిన కలెక్టర్, "అంతా మీ ఇష్టమేనా..? మీరు ఉండరు.. మీ సూపరింటెండెంట్ ఉండరు.. ఆసుపత్రిని గాలికి వదిలేశారా..?" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు అనుమతి తీసుకోకుండా, సెలవు దరఖాస్తు (సీఎల్) ఇవ్వకుండా విధులకు ఎలా గైర్హాజరవుతారని ప్రశ్నించారు. "ఎవరి అనుమతి లేకుండా విధులు వదిలి ఎలా వెళ్తారు..? ఆసుపత్రిని మీరే నడుపుతున్నారా..?" అంటూ మందలించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించిన ఆసుపత్రి పర్యవేక్షకుడికి షోకాజ్ నోటీసు జారీ చేసి, తగిన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ హరిత ఆదేశించారు.

Next Story