వ్యాపారిని మోసగించిన వ్యక్తి అరెస్ట్

by Taduka Kalyani |

స్క్రాప్ ను కొనుగోలు చేస్తానని నమ్మించి ఓ వ్యాపారిని మోసం చేసిన కేసులో మైలార్ దేవ్ పల్లి పోలీసులు ఓ నిందితుడిని అరెస్టు చేశారు.

వ్యాపారిని మోసగించిన వ్యక్తి అరెస్ట్
X

దిశ, రాజేంద్రనగర్ : స్క్రాప్ ను కొనుగోలు చేస్తానని నమ్మించి ఓ వ్యాపారిని మోసం చేసిన కేసులో మైలార్ దేవ్ పల్లి పోలీసులు ఓ నిందితుడిని అరెస్టు చేశారు. ఎస్సై జయలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం... కర్ణాటక కు చెందిన సయ్యద్ సోహెల్ (40) మే 17 న కాటేదాన్ పారిశ్రామిక వాడకు వచ్చాడు. అల్యూమినియం స్క్రాప్ ను గుర్తించి అబ్దుల్ వహీద్ తో కలిసి మోసం చేసేందుకు పథకం రచించాడు. సుల్తాన్ పటేల్ కు చెందిన గోడౌన్ లో స్క్రాప్ ను గుర్తించిన ఇద్దరు నిందితులు మహమ్మద్ యాసర్ పటేల్ సంప్రదించి పెద్ద మొత్తంలో పాత అల్యూమినియం స్క్రాప్ అందుబాటులో ఉందని నమ్మించారు. మే 19వ తేదీన మహమ్మద్ యాసర్ పటేల్ స్క్రాప్ కొనుగోలు నిమిత్తం కాటేదాన్ స్క్రాప్ షాప్ కు వచ్చాడు. స్క్రాప్ ను వాహనాల్లో లోడ్ చేస్తున్న సమయంలో సయ్యద్ సోహెల్ అడ్వాన్స్ గా డబ్బులు 10 లక్షలు నగదు ఇవ్వాలని బ్యాంకులో డిపాజిట్ చేయాలని చెప్పి డబ్బులు తీసుకుని పరారయ్యాడు. 10 లక్షలు లోని కొంత నగదును అబ్దుల్ వహీద్ కు అందజేశాడు. కొద్ది సమయం తర్వాత యాసీర్ పటేల్ సోహెల్ కు ఫోన్ చేయడంతో స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దీంతో మోసపోయానని గుర్తించిన యాసీర్ మైలార్ దేవ్ పల్లి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో సయ్యద్ సోహెల్ అరెస్టు కాగా అబ్దుల్ వహీద్ పరారయ్యాడు. నిందితుడి నుంచి ఏడు లక్షల నగదు, ఆరు సిమ్ కార్డులు, రెండు మొబైల్ ఫోన్లు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు.

Next Story