యెన్యుమరేషమ్ దశ సమయాన్ని 60 రోజులకు పెంచండి: టీపీసీసీ ఎలక్షన్ కమిషన్ కో ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ రాజేష్ కుమార్

by Ajay Maddhiboyina |

సర్ ప్రక్రియలో యెన్యుమరేషమ్ దశ సమయాన్ని 30 రోజులు కాకుండా 60 రోజులకు పెంచాలని, రాష్ట్రంలో పలు నియోజకవర్గాలలో ఇప్పటికి కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏల జాబితా బూత్ లెవెల్ ఆఫీసర్ లకి అందలేనందుకు తక్షణమే ఈ జాబితాని బీఎల్ఓలకి ఇవ్వాలని కోరుతూ టీపీసీసీ ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ పులిపాటి రాజేష్ కుమార్ తో కూడిన బృందం చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ సి. సుదర్శన్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు.

యెన్యుమరేషమ్ దశ సమయాన్ని 60 రోజులకు పెంచండి: టీపీసీసీ ఎలక్షన్ కమిషన్ కో ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ రాజేష్ కుమార్
X

దిశ, తెలంగాణ బ్యూరో : సర్ ప్రక్రియలో యెన్యుమరేషమ్ దశ సమయాన్ని 30 రోజులు కాకుండా 60 రోజులకు పెంచాలని, రాష్ట్రంలో పలు నియోజకవర్గాలలో ఇప్పటికి కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏల జాబితా బూత్ లెవెల్ ఆఫీసర్ లకి అందలేనందుకు తక్షణమే ఈ జాబితాని బీఎల్ఓలకి ఇవ్వాలని కోరుతూ టీపీసీసీ ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ పులిపాటి రాజేష్ కుమార్ తో కూడిన బృందం చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ సి. సుదర్శన్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం సీఈఓ కార్యాలయంలో ఆయనకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం రాజేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ ద్వారా ప్రక్రియ మొదలైందని, ఇందులో భాగంగా బూత్ లెవెల్ ఆఫీసర్లు 2025 ఓటర్ జాబితాలో ఉన్న ఓటర్లకు అందరికీ ఏనుమేరేషన్ ఫారం ఇంటింటికి వెళ్లి ఇవ్వాల్సి ఉందన్నారు.

కానీ, కొన్ని ప్రాంతాలలో ఈ యెన్యుమరేషన్ ఫారం ఇవ్వడంలో ఆలస్యమైందని పులిపాటి రాజేష్ కుమార్ తెలిపారు. బీఎల్ఓ విధులు చేస్తున్న ఆశా వర్కర్లు పల్స్ పోలియో కార్యక్రమం ఉన్నందున మూడు రోజులు ఏనుమేరేషన్ ఫారం ఇవ్వడంలో ఇబ్బంది కలుగుతుందని చెప్తున్నారని ఆయన అన్నారు. దీనికి సుదర్శన్ రెడ్డి స్పందిస్తూ కేంద్ర ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారన్నారు. బూత్ లెవెల్ లో జరుగుతున్న జాప్యంపై, అలాగే ఇతర విషయాలపై డీఈఓలకి, ఈఆర్ఓలకి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశా నిర్ధేశం చేస్తామని ఆయన హామీ ఇచ్చారన్నారు. ఈ భేటీలో కమిటీ సభ్యులు గోపిశెట్టి రాఘవేందర్, బైకినీ లింగం యాదవ్ లు పాల్గొన్నారు.

Next Story