- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓట్లపై అప్రమత్తంగా ఉండాలి : మంత్రి జూపల్లి
ఆదిలాబాద్ పట్టణంలో నిర్వహించిన బీఎల్ఏ-2 అవగాహన సమావేశంలో రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొని పార్టీ శ్రేణులకు కీలక సూచనలు చేశారు.

దిశ,ఆదిలాబాద్ : ఆదిలాబాద్ పట్టణంలో నిర్వహించిన బీఎల్ఏ-2 అవగాహన సమావేశంలో రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొని పార్టీ శ్రేణులకు కీలక సూచనలు చేశారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ సర్ ప్రక్రియలో ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా బీఎల్ఏలు, మండల అధ్యక్షులు, సూపర్‌వైజర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. గ్రామాలు, పట్టణాల్లో జరుగుతున్న ఎన్యుమరేషన్ ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, బీఎల్వోలతో సమన్వయం చేసుకుని ఓటర్ల వివరాలను సక్రమంగా నమోదు చేయించాలని అన్నారు. ముఖ్యంగా స్థానికంగా లేని ఓటర్ల వివరాలపై ప్రత్యేక దృష్టి సారించి మ్యాపింగ్ పూర్తి చేయాలని, ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు అమూల్యమని, ఒక్క ఓటు కూడా కోల్పోకుండా పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో పని చేయాలని పిలుపునిచ్చారు.
మైనార్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్యే లక్ష్యం..
ఆదిలాబాద్ పట్టణంలోని బంగారు గూడలో రూ.20 కోట్ల వ్యయంతో నిర్మించిన మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల–కళాశాల నూతన భవనాన్ని రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, అజారుద్దీన్,ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.అనంతరం తరగతి గదులు, వసతి గదులు, భోజనశాల, ఇతర మౌలిక వసతులను పరిశీలించారు. మైనార్టీ విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యతో పాటు ఆధునిక సదుపాయాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రులు తెలిపారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని విద్యనే ఆయుధంగా మలుచుకుని ఉన్నత స్థానాలను అధిరోహించాలని సూచించారు.అలాగే విద్యా సంస్థల ప్రాంగణంలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.
ఇందిరమ్మ ఇళ్లతో పేదలకు శాశ్వత నివాసం..
ఆదిలాబాద్ పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిర్మించిన నూతన గృహాలను రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రారంభించారు. లబ్ధిదారుల కుటుంబాలను అభినందించిన మంత్రులు వారికి వస్త్రాలు అందజేసి సన్మానించారు.పేద కుటుంబాలకు గౌరవప్రదమైన సొంత ఇల్లు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి శాశ్వత నివాస సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమాల్లో ఎంపీ జి.నగేష్,ఎమ్మెల్యే పాయల్ శంకర్,డీసీసీ అధ్యక్షులు డా.నరేష్ జాదవ్,మార్కెట్ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష,మాజీ ఎంపీ సోయం బాపూరావు,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నరసయ్య,సాజిద్ ఖాన్, గండ్రత్ సుజాత, అల్లూరి సంజీవరెడ్డి, అడ్డి భోజారెడ్డి, గోక గణేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ ఆర్.ఎస్. చిత్రు తదితరులు పాల్గొన్నారు.






