- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ. 200 కోట్లు రాముల వారి సొమ్ము దోచుకున్నారు : సామ రామ్మోహన్ రెడ్డి
దేశ ప్రజలకు అయోధ్య రాముడు అంటే ఒక నమ్మకమని, అలాంటి నమ్మకాన్ని బీజేపీ వమ్ము చేస్తుందని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్, సామ రామ్మోహన్ రెడ్డి మండిపడ్డారు.

దిశ, తెలంగాణ బ్యూరో : దేశ ప్రజలకు అయోధ్య రాముడు అంటే ఒక నమ్మకమని, అలాంటి నమ్మకాన్ని బీజేపీ వమ్ము చేస్తుందని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్, సామ రామ్మోహన్ రెడ్డి మండిపడ్డారు. శనివారం గాంధీభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ హుండీలో డబ్బులు, వెండి ఇటుకలు, ఇతర బంగారు ఆభరణాలు దొంగిలించింది బీజేపీ నాయకులే అని, అయోధ్య రామ మందిరం నిర్మించి 3 ఏళ్లు కాకముందే ఇంత చేశారని, సుమారు రూ. 200 కోట్ల రూపాయలు మేర రాముల వారి సొమ్ము దోచుకున్నారని సామ రామ్మోహన్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. రాముల వారు ధరించే వజ్రాల హారం నుండి పాద రక్షల దాకా అన్ని దోచుకున్నారని, యోగి ఆదిత్య నాథ్ నామమాత్రంగా ముగ్గురు సభ్యులతో సిట్ వేశారని సామ రామ్మోహాన్ రెడ్డి విమర్శించారు. కొంత మంది కింది స్థాయి ఉద్యోగులను అరెస్ట్ చేశారని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులకు బీజేపీ సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు. ఈ దొంగతనానికి పూర్తి బాధ్యత ప్రధాని తీసుకోవాలని సామ రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. దేవుడి జోలికి వెళ్లినవాడు బ్రతికి కట్టింది లేదని, రాబోయే రోజుల్లో బీజేపీ పరిస్థితి కూడా అదే అవుతుందని ఆగ్రహాం వ్యక్తం చేశారు. రాముల వారికి బీజేపీ గురించి తెలుసు అందుకే అయోధ్యలో బీజేపీ ఓడిపోయిందని, ఈ దొంగతనం కేసులో సీబీఐ దర్యాప్తు జరగాలని సామ రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ కేవలం దేవుడి పేరు మీద, మతం పేరు మీద రాజకీయం చేస్తుందని, యోగి ఆదిత్య నాథ్ గోమాత గురించి మాట్లాడుతారని, కానీ, బీఫ్ ఎక్స్పోర్ట్ లో దేశంలోనే నెంబర్ వన్ గా యూపీ ఉందన్నారు.






