పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

by Batti.Sumithra |

ఇందిరమ్మ పథకం లబ్ధిదారులకు గోడ గడియారాలను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పంపిణీ చేశారు.

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
X

దిశ, మద్నూర్ : ఇందిరమ్మ పథకం లబ్ధిదారులకు గోడ గడియారాలను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పంపిణీ చేశారు. మద్నూర్ మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు గడియారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ "ప్రతి ఇంటి అభివృద్ధి, నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం" అని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేరేలా నిరంతరం కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.

లబ్ధిదారుల సంతోషం

గోడ గడియారాలు అందుకున్న లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు తమ జీవితాల్లో వెలుగు నింపుతున్నాయని కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాణి, ఎంపీవో సత్యనారాయణ, మండల అధ్యక్షుడు సాయిలు, మిర్జాపూర్ ఆలయ కమిటీ చైర్మన్ రామ్ పటేల్, హనుమంత్, అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story